క్రైమ్/లీగల్

మహిళ దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ.హీరేహాల్, జూలై 13 : మండలంలోని తమ్మెపల్లి గ్రామంలో బోయ అక్కమ్మ (35) శుక్రవారం హత్యకు గురైంది. సీఐ చలపతిరావు తెలిపిన వివరాల మేరకు మృతురాలి భర్త గంగాధర్ తాగుడుకు బానిసై డబ్బు కోసం అక్కమ్మను నిత్యం వేధించేవాడు. ఇందులో భాగంగానే కూలి పని ముగించుకుని ఇంటికి వచ్చిన అక్కమ్మను డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు. ఇందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన గంగాధర్ తాగిమత్తులో అక్కమ్మపై గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. తర్వాత సీఐ చలపతిరావు వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

మహిళ ఆత్మహత్య
అనంతపురం అర్బన్, జూలై 13: కుటుంబ పోషణ కష్టం కావటం..్భర్త పూర్తిగా మద్యం వ్యసనానికి బానిస కావటంతో చేసేది లేక వివాహిత లక్ష్మిదేవి (34) గురువారం మాతర్లు అధిక మోతాదులో తీసుకొని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన ఇది. మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహదేవ్‌నగర్‌కు చెందిన ఆంజినేయులు అనే వ్యక్తి బోర్‌లారీకి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందరూ కలిసి లక్ష్మిదేవి వాళ్ల తల్లి ఇంట్లోనే ఉంటున్నారు. ఇదే సందర్భంలో ఆంజినేయులు మధ్యం మత్తుకు బానిస కావడంతో పాటు ఇంటి విషయాలు పట్టించుకోకపోవటం వల్ల, నలుగురు పిల్లలు సంతానం ఉండటంతో జీవనం కష్టంగా కష్టంగా మారింది. భర్తకు మధ్యం మానేయ్యాలని ఎన్నిసార్లు ప్రాదేయపడినా వినకపోవడంతో చేసేదిలేక, ఆర్థిక సమస్యలు తాళలేక గురువారం అధిక మోతాదులో మాతర్లు తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసంది. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.