గుంటూరు

హైకోర్టు మాజీ న్యాయమూర్తితో రోహిత్ ఆత్మహత్యపై విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జనవరి 21: హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులపై హైకోర్టు మాజీ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా రోహిత్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఈ ఘటనపై వౌనం వహించడం నేరాన్ని అంగీకరించినట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. చనిపోయిన విద్యార్థి ఏ కులానికి చెందినవారైనప్పటికీ అధికారంలో ఉన్నది బిజెపి అని గుర్తెరగాలన్నారు. ఈ సమావేశంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మహంకాళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.