క్రైమ్/లీగల్

పథకం ప్రకారం ముగ్గురిని హత్య చేయడం దుర్మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, ఆగస్టు 10: పథకం ప్రకారం వైసీపీవారు ముగ్గురిని హతమార్చడం దుర్మార్గమైన చర్య అని సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మంత్రి ఆనందబాబు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉన్న గురజాల సోమయ్య, చల్లా వెంకట కృష్ణ, మేడబోయిన మల్లికార్జునరావు మృతదేహాలను సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వైసీపీ అధినాయకుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడని, ఇదే పద్ధతిలో స్థానిక వైసీపీ నాయకులు కూడా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుతగులుతున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పోలీసులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లో ఫ్యాక్షన్లకు పాల్పడేవారిని గుర్తించి ముందుగానే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలన్నారు. మృతుల కుటుంబాలను పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని, నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి ఆనందబాబు పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్డు వేస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుతగిలి హెచ్చరించారని వారన్నారు. వినుకొండకు వస్తున్న తమ టీడీపీ కార్యకర్తలను హైటెక్ పద్ధతిలో పథకం ప్రకారం కారులో వెంబడించి, మోటార్ సైకిల్‌పై వస్తున్న ముగ్గురిని ఢీకొట్టి హత్య చేశారని అన్నారు. నాలుగేళ్ళుగా ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కక్షలు, కార్పణ్యాలకు, హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని వారు అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల వంతున ఆర్థిక సాయం చేస్తానని, పార్టీ తరపున ఆయా కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవడమే కాకుండా వారి పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచితంగా చదువు చెప్పిస్తామన్నారు. మృతదేహాలను స్వగ్రామమైన అందుగుల కొత్తపాలెంగ్రామానికి తీసుకెళ్ళారు. గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు రాయపాటి రంగారావు మృతుల కుటుంబాలకు 50వేల వంతున అందచేశారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే జీవీతోపాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.