గుంటూరు

తెనాలి జిల్లా వైద్యశాలకు త్వరలో ఎంఆర్‌ఐ స్కాన్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, సెప్టెంబర్ 18: మరోమూడు నెలల్లో తెనాలి జిల్లా వైద్యశాలలో ఎంఆర్‌ఐ స్కాన్ అందుబాటులోకి వస్తుందని స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం వైద్యశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యశాల ఇప్పటికే రోగులకు అవసరమైన అన్నిరకాల సదుపాయాలు అందించే విధంగా సిద్ధంగా ఉందని అయితే ఎంఆర్‌ఐ, ఐసీయూ యూనిట్స్‌లేని లోటు కూడా తీరుతుందని చెప్పారు. ఇప్పటికే ఎంఆర్‌ఐ , ఐసీయూ యూనిట్లకు కావాల్సిన స్థలాన్ని అప్పగించినట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన తల్లీపిల్లల వైద్యశాల 2వ అంతస్తుల భవనాన్ని ఉపయోగించుకుంటున్నట్లు 3వ అంతస్తుకూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తున్నట్లు చెప్పారు. మరోవైపు తల్లీపిల్లల వైద్యశాలకు కావాల్సిన జనరేటర్, ఏసీలు తక్కువ కోట్ చేసిన వారికి అందిస్తున్నామని దీనివల్ల తల్లీపిల్లల వైద్యశాలలో అన్నివసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పాత డెలివరీ, లేబర్ రూములలో పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులతో పాటుగా ఐసీయూ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆలపాటి వివరించారు. శవాగారంలో స్టెరిలైజేషన్ చేసేందుకు కావాల్సిన పరికరాన్ని కొనుగోలు చేసేందుకు కమిటీ సమావేశం తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. వైద్యశాలకు వచ్చిన తల్లీపిల్లలకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్బయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ సనత్‌కుమార్, సభ్యులు తాడిబోయిన శ్రీనివాసరావు, కొత్త సుబ్రమణ్యం, జయకరుణ, ఏఈ విశే్వశ్వరరావు, డీఈఈ, డీవీ మల్లిఖార్జునరావు, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, ఏఓ డాక్టర్ రవి, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహ్మద్ ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.

కమీషన్లు రాకనే ఆగిన ఘాట్ అభివృద్ధి
వావిలాల ఘాట్ వద్ద
టీడీపీ జెండా పాతడం సంస్కారం కాదు
* వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి
సత్తెనపల్లి, సెప్టెంబర్ 18: ప్రముఖ స్వాంతంత్య్ర సమరయోధుడు, పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి రోజున ఘాట్‌లో టీడీపీ జెండా పాతి వావిలాలకు తీవ్ర అవమానం చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగుసార్లు సత్తెనపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రాతినిధ్యం వహించిన వావిలాల ఉన్నత ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయం అన్నారు. కనుకనే ఆయన జయంతి వేడుకలను వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం గెలిచారని, ఎప్పుడైనా వావిలాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన వచ్చిందా అని, సభాపతిగా ఆ బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వక పోవటం వల్లే ఘాట్ అభివృద్ధి పనులు సగంలోనే నిలిపివేశారని ఆరోపించారు. దీన్ని వివాదం చేయాలన్న ఆలోచన లేదని వారు చేసింది తప్పుఅని గ్రహిస్తే చాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగుల్‌మీరాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, ప్రగతి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మక్కెన అచ్చయ్య, జిల్లా మైనార్టీ నాయకులు సయ్యద్ మాబు, తదితరులు పాల్గొన్నారు.