గుంటూరు

పోలవరం ప్రాజెక్టుకు అసలు కాంట్రాక్టర్ చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, సెప్టెంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అసలు కాంట్రాక్టర్ చంద్రబాబేనని, ఆయనే సబ్‌కాంట్రాక్టర్లకు పనులు పంచుకుని కేంద్రం మంజూరు చేసిన నిధులు తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మోసంచేస్తున్నారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం తెనాలి పట్టణంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విభజన చట్టం లో పేర్కొన్న ప్రకారం ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి 5వేల కోట్లు మాత్రమే వస్తాయని, ప్రత్యేక ప్యాకేజీ కింద 16500 కోట్లు ఇస్తామని నాడు బీజెపీ ప్రభుత్వం చెప్పిందని ఆప్రకారంగానే 10 సంవత్సరాలలో చేయాల్సిన అభివృద్ధిని అనతికాలంలోనే చేస్తూవస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం ఖర్చు చేయాల్సియున్నప్పటికీ కేంద్రమే పూర్తిగా భరిస్తూ ప్రజాసంక్షేమం కోరి నిధులు మంజూరుచేసి అప్పగిస్తుంటే అవన్నీ తామే చేసినట్లు, కేంద్రంతో ఎటువంటి సంబంధం లేనట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తూ మిత్రద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచారని విమర్శించారు. నాడు విభజనకు అన్ని పార్టీలు ఓకే చెప్పి ఇప్పుడు బీజెపీని మాత్రమే ముద్దాయిగా చూపటం చంద్రబాబుకే చెల్లిందన్నారు. 2019 ఎన్నికలలో తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల నుండి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మీడియా నిర్వాహకులు ఓమారు ఆత్మపరిశీలన చేసుకొని ఏది సత్యమో, ఏది అబద్ధమో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీలోని రాష్ట్ర, జిల్లా, తెనాలి నియోజకవర్గ స్థాయి నాయకులు, సమన్వయ కమిటీ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

దీక్షాపట్టుదలతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు
పొన్నూరు, సెప్టెంబర్ 18: పొన్నూరు రోటరీ క్లబ్ నేతృత్వంలో మండల పరిధిలోని చింతలపూడి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మంగళవారం జరిగిన సభలో వివిధ రంగాల్లో రాణించిన ముగ్గురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. కేరళ రాష్ట్రంలో ఇటీవల వరద తాకిడికి బలవుతున్న 23 మంది ప్రాణాలను రక్షించిన నేవి గార్డ్ మహంకాళి గోపీనాథ్ (మాచవరం), ద్రోణాచార్య అవార్డు గ్రహీత భారత రోయింగ్ టీమ్ కోచ్ ఎస్‌కె ఇస్మాయిల్ బేగ్ (చందోలు), ఏషియన్ పసిఫిక్ గేమ్స్‌లో రెండు బంగారు, ఒక రజిత పతకం సాధించిన ఎస్‌కె ఖాజా మొహిద్దీన్ (చందోలు)లను పొన్నూరు రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అభినందన సత్కారమందుకున్న ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ చదువుతో పాటు ఆరోగ్య మానసిక వికాసానికి దోహదపడే క్రీడల్లో కూడా రాణించేందుకు కొంతసమయం కేటాయించాలని యువతకు సూచించారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం వలన తాను 130కు పైగా మెడల్స్ సాధించగలిగానన్నారు. తాను విద్యనభ్యసించిన పొన్నూరులోనే సత్కారమందుకోవడం సంతోషంగా ఉందన్నారు.