గుంటూరు

పెనుమాకలో ఇళ్ళు, షాపులు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: రాజధాని గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో ఆదివారం ఉదయం ఆర్ అండ్‌బి అధికారులు రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్ళు, షాపులు తొలగించారు. ఆదివారం ఉదయం అధికారులు అమరావతి మార్గంలోని బొడ్డురాయి సెంటర్ వద్ద లారీని రోడ్డుకు అడ్డంగా ఆపి ట్రాఫిక్ తిరగకుండా చేసి పొక్లెయినర్లతో ఇళ్ళు, దుకాణాలు కూల్చివేశారు. అయితే ఈక్రమంలో బాధితులకు, అధికారులకు వాగ్వాదం జరిగింది. మూడు తరాలుగా ఇళ్ళు నిర్మించుకుని జీవిస్తున్నామని, ఇప్పుడు తొలగిస్తే ఏవిధంగా జీవించాలని అధికారులను ప్రశ్నించారు. దీనితో రెవెన్యూ అధికారులు స్పందిస్తూ తమంతట తాముగా ఇళ్ళు పగలగొట్టుకోవాలని, లేకుండా పొక్లెయినర్లతో తొలగించాల్సి ఉంటుందని చెప్పటంతో పెనుమాకవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కావటంతో కోర్టుని ఆశ్రయించి రహదారుల విస్తరణను నిలుపు చేసుకోవటానికి వీలులేకుండా ఉండటంతో తమ పని ముగించారు. దీనితో ఇనే్నళ్ళుగా తమకు ఆశ్రయమిచ్చిన ఇళ్ళు, జీవనానికి తోడ్పడిన దుకాణాలు కళ్ళముందే కూలిపోతుంటే గుండెలవిసేలా బాధితులు విలపించారు.
నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాం కూడా ఇవ్వాలి
ప్రజలకండగా ఉండాల్సిన ప్రభుత్వం తన మాష్టర్‌ప్లాన్ అమలుచేసే క్రమంలో తీసుకున్న నిర్ణయాల వలన సమిధలవుతున్న కుటుంబాలవారికి నష్టపరిహారం ఇవ్వటంతో పాటు వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చి వాటిలో గృహాలు నిర్మించి ఇవ్వాలని సిపిఎం రాజదాని కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిపిఎం రాజధాని కమిటీ నాయకులు ఎం రవి, నవీన్ ప్రకాష్, పీరూసాహెబ్, శ్రీనివాసరెడ్డి, మెహన్‌రెడ్డి తదితరులు బాధితులను కలిసి వివరాలు సేకరించారు.

గ్రామాలకు విస్తరించిన కాపు ఉద్యమం
* ఆందోళనలో పాల్గొన్న మహిళలు
* ఐక్య గర్జనకు సిద్ధమైన కాపు వర్గీయులు
* జిల్లాలోని అనేక మండలాల్లో ఆందోళన
* చిలకలూరిపేటలో ఉద్యమకారులను అరెస్ట్‌చేసిన పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 7: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణనిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకోవడంతో సంఘీభావంగా కాపువర్గీయులు చేపట్టిన ఉద్యమం గ్రామాలకూ పాకింది. శనివారం జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని పోలిరెడ్డిపాలెం, అమరావతి మండలంలోని మల్లాది, సత్తెనపల్లి మండలంలోని బుర్రిపాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, రేపల్లె మండలంలోని ఉప్పూడి, చెరుకుపల్లి మండలంలోని ఊసరవల్లిపాలెం, నగరం మండలంలోని కొలగానివారిపాలెం, రాజుపాలెం, కొల్లూరు, పొన్నూరు, నరసరావుపేట, గుంటూరు కేంద్రాల్లో ఉద్యమం చోటుచేసుకుంది. ముఖ్యంగా మహిళలు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. గుంటూరు నగరంలోని నగరంపాలెంలో కాపు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. దీక్షలకు వైసిపి ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా, కావటి మనోహర్ నాయుడు, కెకె తదితర నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు సంఘీభావంగా కంచంపై గరిటతో చప్పుడు చేశారు. ముద్రగడ పిలుపులో భాగంగా గాంధీగిరి పద్ధతిలో కంచంపై గరిటతో చప్పుడు చేస్తూ కాపు వర్గీయుల రిజర్వేషన్‌ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. మండల కేంద్రాల్లో ముఖ్యంగా మున్సిపాలటీల్లో కాపు వర్గీయులు ఉద్యమ బాటలో నడవడంతో పోలీసులు అరెస్ట్‌కు సిద్ధమయ్యారు. ఆదివారం చిలకలూరిపేట మున్సిపల్ కేంద్రంలో కాపు వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ చేశారు. శుక్ర, శనివారాల్లో కూడా పట్టణాల్లో కాపు సంఘీయులు ఆందోళనకు సిద్ధమైన సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి జులుం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో కాపు సంఘనేతలు ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఉద్యమాన్ని గ్రామాలకు విస్తరించే దిశగా ఆలోచనలు చేసి అందుకు అనుగుణంగా ఆదివారం గ్రామాల్లో నడిపించారు. అనేక మండలాల్లో ఉద్యమం గ్రామాలబాట పట్టడంతో పోలీసులు చోద్యం చూడడం మినహా అరెస్ట్‌లు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే జిల్లాలోని పోలీస్ యంత్రాంగం సగానికి పైగా విశాఖపట్టణంలో జరుగుతున్న ఫ్లీట్ ఉత్సవాల భద్రత కోసం, తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. అందువల్ల మండల కేంద్రాల్లో ఉద్యమం నిర్వహించే దశలో పోలీసులు అరెస్ట్‌కు సిద్ధమవుతున్నారని గుర్తించిన కాపునాయకులు గ్రామాల్లో ఉద్యమాన్ని తీవ్రరూపంలో తీసుకెళ్లేందుకు చేసిన వ్యూహరచన ఫలితాలనిచ్చింది. ముద్రగడ పేరుని ప్రస్తావించకపోయినప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రభుత్వం త్వరితగతిన కాపు వర్గీయులతో సమాలోచనలు చేసి సమస్యలను పరిష్కరించాలని ట్విట్ చేయడం కాపు వర్గీయులకు బలాన్నిచ్చింది. ప్రభుత్వం విశాఖ ఫ్లీట్ ఉత్సవాల అనంతరం కాపు వర్గీయులతో సమాలోచనలు చేసి, సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.

ముద్రగడ ఆరోగ్యంపై సిఎం ఆందోళన
* టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్
గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 7: కాపునేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనలో ఉన్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, అందుకే ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనే జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ముద్రగడ దీక్షను విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కాపు సంఘీయులు కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు పడుతున్న బాధలను చూసి చలించి వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇటీవల తునిలో కాపుల సభ జరిగినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు కల్పించలేదన్నారు. అయితే రైల్‌రోకోలు చేపట్టడంతో పాటు ప్రజలను కొందరు నాయకులు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. కాపుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముద్రగడ వ్యవహరించకుండా తక్షణమే దీక్షను విరమించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు చిట్టిబాబు, కె హనుమంతరావు, డి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు శాస్తవ్రేత్తలుగా ఎదగాలి
గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 7: విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లలో పాల్గొని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా భావిశాస్తవ్రేత్తలుగా ఎదగాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆకాంక్షించారు. ఆర్టీసీ కాలనీలోని కన్న ఇంగ్లీషు మీడియం స్కూలులో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక ప్రదర్శ న ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడుతూ విద్యార్థులు శాస్తవ్రేత్తల గురించి తెలుసుకోవడం, వైజ్ఞానిక ప్ర దర్శనల పట్ల ఆసక్తి కలిగించేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు. తల్లిదండ్రులు వారి చిన్నారులను ఇంజనీర్లు, డాక్టర్లుగా చూడటం తోపాటు చరిత్ర పుటలలో నిలిచిపోయే శాస్తవ్రేత్తలుగా రాణించేలా ప్రోత్సాహి ంచాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేస్తూ రాజీనామా చేసి పేద, బడుగు వర్గాల విద్యాభివృద్ధికి కృ షి చేస్తున్న కన్న మాష్టారి సేవలు ఎనలేనివని కొనియాడారు. కన్న విద్యాసంస్థల అధినేత కన్న మాష్టారు మాట్లాడు తూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, సామాజికశాస్త్రాలు, పండుగల వంటి ప్రదర్శనలతో పాటు నవ్యాంధ్ర రాజధాని, విశాఖనగర అందాలు వంటి 400 ప్రదర్శనలను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం విజయలక్ష్మి, టిడిపి సీనియర్ నాయకులు వెన్నా సాంబశివారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

టెన్నిస్ ఫైనల్‌కు చేరిన జ్ఞానిత, అశ్రీత
గుంటూరు (స్పోర్ట్స్), ఫిబ్రవరి 7: కెఎన్‌ఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ టెన్నిస్ స్టేడియంలో జరుగుతున్న ఐటా అండర్-14 బాల బాలికల పోటీల్లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లలో ఎపికి చెందిన జ్ఞానిత, అశ్రీత ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్స్‌లో జ్ఞానిత 8-2 పాయింట్లతో సాయిదివ్యపై గెలుపొందగా, అశ్రీత 8-1తో కీర్తిపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జ్ఞానిత 7-1తో సాత్వికపై సాయిదివ్య 7-5తో అనూషపై, ఎల్ అశ్రీత 7-5తో డి ఆశ్రీతపై, ఎస్ కీర్తి 7-4తో ప్రవల్లికపై గెలుపొందారు. బాలుర విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో గణేష్‌చౌదరి 7-2తో తరుణ్‌జాషువాపై, నిరంజన్ 7-4తో గిరీష్‌పై, ఫిరోజ్ 7-4తో కుషాల్‌పై, శశాంక్ 7-3 పాయింట్లతో జయకృష్ణపై గెలుపొందారు.

త్యాగయ్యకు సన్మండలి స్వరార్చన
గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 7: నాదోపాసన చేసి, అనితర సాధ్యమైన కృతులు, కీర్తనలు, సాహిత్యాన్ని రచించి, సమాజాన్ని భక్తిపారవశ్యంలో నడిపించిన సంగీత సరస్వతి వరపుత్రుడు శ్రీ త్యాగరాజస్వామికి వందమందికి పైగా నగరంలోని కళాకారులు పంచరత్న నీరాజనాలు అర్పించారు. సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకున్న ఈ పంచరత్న సేవ ఆదివారం ఉదయం 9.30 గంటలకు బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరీపీఠ దత్తత ఓంకార క్షేత్ర ప్రాంగణంలో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యాన జరిగింది. ఈ సంస్థ ఆధ్వర్యాన నిర్వహించబడుతున్న త్యాగబ్రహ్మ 169వ ఆరాధనా సంగీత మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఓంకార క్షేత్రం నుంచి నగరంలోని పురవీధుల గుండా నగరోత్సవం నిర్వహించారు. బెజవాడ వెంకటేశ్వర్లు బృందం నాదస్వర ఆలాపనతో ప్రారంభమైన ఉత్సవంలో భాగంగా పలువురు గాయనీ గాయకులు, వివిధ వయస్సులకు చెందిన కళాకారులు నాదయోగికి పంచరత్న సేవ చేశారు. తన జీవిత చరమాంకంలో రామసాక్షాత్కారం పొందే దివ్య సమయానికి ముందుగా సంగీత సద్గురువు త్యాగయ్య 5 ప్రధానమైన కీర్తనలను రచించి తమ ఆరాధ్యదైవాలకు కైంకర్యంగా సమర్పించారు. ప్రతియేటా సంగీత విద్వాంసులు, గానకళలో ప్రవేశమున్న ప్రతి ఒక్కరూకూడా త్యాగయ్య ఆరాధనోత్సవాల్లో పంచరత్న సేవ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంప్రదాయానికి అనుగుణంగా గాయత్రీ మహిళా సంగీత సన్మండలి నిర్వహించిన ఈ నీరాజన కార్యక్రమంలో డాక్టర్ టి సూర్యకాంతం, ఎంవై శేషురాణి, డాక్టర్ ఆర్ సరళాదేవి, కమలా జయరామ్, శారదా గోవిందరాజు, లక్ష్మీ శ్రీనివాస్, పాటిబండ్ల లలితాదేవి, సుమిత్ర, సన్మండలి కార్యవర్గ సభ్యులు నగరంలోని సంగీత విద్వాంసులు అత్యంత భక్తిప్రపత్తులతో పంచరత్న కీర్తనలను ఆలపించి పరమభాగవతోత్తముడైన త్యాగరుషికి స్వరార్చన చేశారు. అంతకుమందు త్యాగరాజ చిత్రపటాన్ని వీధుల్లో ఊరేగించారు.