క్రైమ్/లీగల్

శివాలయంలో పంచలోహ విగ్రహాల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచవరం, నవంబర్ 10: స్థానిక శి వాలయంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండుగులు ఆలయం తలుపులు పగులగొట్టి సు మారు మూడు లక్షలు చేసే రెండు పం చలోహ విగ్రహాల దొంగిలించారు. శుక్రవారం తెల్లవారుఝామున ఆల య పూజారి దేవాలయాన్ని తెరిచేందుకు వెళ్ళగా అప్పటికే తలుపులు పగిలిపోయి ఉన్నాయని పూజారి సత్యానంద శర్మ విలేఖరులకు తెలిపారు. గతంలో ఇదే శివాలయంలో ఉత్సవ విగ్రహాల కోసం అప్పుడు కూడా తా ళాలు పగులకొట్టగా, ఆలయ ధర్మకర్త గృహంలో ఈ విగ్రహాలను ఉంచారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో ప్రతిరోజు పంచలోహ విగ్రహాలకు అభిషేకాలతోపాటు పూజలు చేసేందు కు తిరిగి శివాలయానికి తెచ్చారు. ఇది గమనించిన దొంగలు ఎట్టకేలకు వాటి ని దొంగిలించారు. దేవాలయంలో ఇత్త డి, వెండి వస్తువులు ఉన్నా వాటిని తీ సుకోకుండా, కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే దొంగిలించారు. ఆ లయ ధర్మకర్త వంకాయల లక్ష్మీనారాయణ, పూజారి సత్యనంద శర్మ ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ జగదీష్ కేసు నమో దు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుండి ప్రత్యేకంగా క్లూస్ టీం వచ్చింది. శివాలయంలో వేలిముద్రలను సేకరించారు. పోలీస్ జాగిలాలు శివాలయం నుండి సమీపంలోని చెంగాయి వాగు వద్ద ఆగాయి. గతంలో చెన్నకేశవస్వామి దేవాలయంలో కూడా పంచలోహ విగ్రహాలు చోరీకి గురైతే ఎస్‌ఐ జగదీష్ నల్గొండ జిల్లాలో పట్టుపడడంతో వాటిని దేవాలయ ధర్మకర్తకు అందచేశారు.

భారీగా అక్రమ రేషన్‌బియ్యం పట్టివేత
చిలకలూరిపేట రూరల్, నవంబర్ 10: మండల పరిధిలోని మానుకొండవారిపాలెం గ్రామంలో కల్లి నాగిరెడ్డికి చెందిన మహాలక్ష్మీ రైస్‌మిల్లులో 700 బస్తాలకు పైగా రేషన్‌బియ్యాన్ని రూర ల్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ బియ్యం సొలస గ్రామానికి చెంది న కిలారు ఆంజనేయ ప్రసాద్‌కు చెం దినవిగా నిర్ధారించిన పోలీసులు ఆం జేనేయ ప్రసాద్‌ను అదుపులోకి తీసు కుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుల రూరల్ సీఐ ఉదయ్‌బాబు తెలిపారు. కాగా చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రంగా రేషన్‌బియ్యం మాఫియా ఎప్పటి నుంచో నడుస్తోంది. సొలస గ్రామానికి చెందిన కిలారు ఆంజనేయ ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా రేషన్‌బియ్యం వ్యాపారాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు అనేక పర్యాయాలు అత న్ని పట్టుకుని కేసులు నమోదు చేసినా అక్రమ రేషన్‌బియ్యం వ్యాపారాన్ని మాత్రం వదలలేదు. దీనిపై ప్రభుత్వాధికారులు గానీ, పోలీసులు గానీ చూసిచూడనట్లు వ్యవహరించడం వల్లే వీరికి అడ్డూ ఆపు లేకుండా పో యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఎవరి మామూళ్లు వారు పుచ్చుకుంటూ అక్రమ రేషన్ వ్యాపారం చేసే ముఠాకు సహకరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు కళ్లుతెరిచి పేదలకు అందాల్సిన రేషన్‌బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.