క్రైమ్/లీగల్

డేంజరస్ చడ్డీగ్యాంగ్ ముద్దాయి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, నవంబర్ 11: ఇటీవల పట్టణ శివారులోని బ్యాంక్ కాలనీ శ్రీరామ్ హైట్స్‌లో, వెంకట సాయి టవర్స్‌లో గత నెల 8న జరిగిన దొంగతనం కేసులో డేంజరస్ చడ్డీగ్యాంగ్‌లోని ముద్దాయిని ఆదివారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 30వేల రూపాయల విలువైన 566 గ్రాముల వెండి వస్తువులను దొంగ మేడా గోరామెసు నుండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ముద్దాయి మేడా గోరామెసు గుజరాత్ రాష్ట్రంలోని గుల్భార్ మండలం, గుల్బార్ గ్రామం, దాహోద్ జిల్లాకు చెందినవాడని, వీరు మొత్తం ఐదుగురు సభ్యుల ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు. వీరి వద్ద మారణాయుధాలు కూడా ఉంటాయని, ప్రజలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీరు నరసరావుపేట, పిడుగురాళ్ళ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అపార్ట్‌మెంట్‌లలోకి ప్రవేశించి, తాళాలు వేసిన ప్లాట్‌లను గమనించి, తాళాలు పగులగొట్టి, ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలకు పాల్పడుతుంటారని అన్నారు. వీరిపై మొత్తం 14 కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. వీరి ముఠా నాయకుడు రంశు బాయి ఆంధ్రలో గృహ నిర్మాణ పనుల కోసం వచ్చి, అదే సమయంలో కొన్ని ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించి, మిగిలిన ముఠా సభ్యులను పిలిపించుకుని, అందరూ కలిసి ఈ దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు. ముద్దాయి మేడా గోరామేసును కొటప్పకొండ రోడ్డులోని యల్లమంద బైపాస్ వద్ద రూరల్ ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం తన సిబ్బంది శ్రీ్ధర్, రాజేష్, చాంద్ బాషా, జానీలు పట్టుకున్నారని తెలిపారు. పోలీస్ అధికారి, సిబ్బందిని డీఎస్పీ కె నాగేశ్వరరావు, సీఐ ప్రభాకర్ అభినందించారు.