గుంటూరు

ఓవైసీ దిష్టిబొమ్మకు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, మార్చి 17: ఎంఐఎం పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా సభ్యులు దిష్టిబొమ్మకు ఉరివేశారు. జిల్లాపార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరిన యువమోర్చా, బిజెపి నాయకులు స్థానిక శంకర్‌విలాస్ సెంటర్‌లో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆ బొమ్మకు ఉరివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ మాట్లాడుతూ ఈ దేశంలో ఉంటూ పదవుల్ని, అధికారాన్ని అనుభవిస్తూ భారతమాతకు వ్యతిరేకంగా మాట్లాడటం దేశ ద్రోహంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా అసదుద్దీన్ ఒవైసీ కొనసాగే అర్హత లేదన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నలబోతు వెంకట్రావు మాట్లాడుతూ ఈ దేశం అన్నీ వర్గాలకు, మతాలకు నిలయమన్నారు. మాతృభూమిని ద్వేషించే వారికి ఈ దేశంలో ఉండే అర్హతలేదన్నారు. ఒవైసీని దేశద్రోహిగా ప్రకటించాలన్నారు.పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లెపు కృపారావు, నూతక్కి దశరధ, నాయకులు ఇత్తడి కిరణ్, కెసివై రాజేష్‌నాయుడు, ఆవుల రామకోటేశ్వరరావు, జిల్లా యువజన మోర్చా అధ్యక్షుడు రావూరి నారాయణ, ఉపాధ్యక్షుడు చిరుమామిళ్ల ఆశోక్, ప్రధానకార్యదర్శి సయ్యద్ నజీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.