గుంటూరు

ఐఆర్‌ఇఎఫ్ హాస్టల్ విద్యార్థిని మృతి అనారోగ్యంతోనేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపల్లె, మార్చి 28: వాంతులు, విరోచనాలతో గుంటూరు వైద్యశాలలో ఆదివారం తెల్లవారుఝామున మృతి చెందిన కృష్ణాజిల్లాకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎం మాధురి(15) మృతదేహాన్ని ఐఆర్‌ఇఎఫ్ చేసిన ఆర్థిక సాయంతో సోమవారం ఆటోలో తల్లి, బంధువులు తమ నివాసమైన కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కాసానగర్‌కు తరలిస్తుండగా పోలీసులు ఆపడం వివాదాస్పదమైంది. మాధురి మృతదేహాన్ని ఆటోలో తీసుకువెళుతుండగా పోలీసులు పెనుమూడి వారధివద్ద తనిఖీలలో భాగంగా ఆటోలో మృతదేహాన్ని కనుగొన్నారు. డాక్టర్ సర్ట్ఫికెట్ గురించి పోలీసులు ప్రశ్నించటంతో మృతి సర్ట్ఫికెట్ లేదని బంధువులు తెలిపారు. దీంతో పోలీసులు అనుమానాస్పదంపై రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. సిఐ మల్లికార్జున ఈసంఘటనపై మాట్లాడుతూ ఐఆర్‌ఇఎఫ్ హాస్టల్‌వద్ద ఏదోహత్య జరిగిందని తనకు ఫోను ద్వారా సమాచారం అందినట్లు, వెంటనే హాస్టల్ గేటువద్దకు చేరుకోగా అప్పటికే మృతదేహాన్ని పోలీసులకు సమాచారం లేకుండా తరలించారని చెప్పారు. దీంతో అవుట్ పోస్టులను అప్రమత్తం చేశామని మాధురి మృతదేహాన్ని రేపల్లె నుండి కృష్ణాజిల్లావైపు తీసుకువెళుతుండగా పట్టుబడిందని, అనంతరం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి, తల్లి చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని మృతదేహానికి పోస్టుమార్టమ్‌చేసి బంధువులకు అప్పగించామని సిఐ తెలిపారు. ఇదిలాఉండగా క్రైస్తవ సంస్థల్లో చదువుతున్న విద్యార్థిని మాధురి అనారోగ్యంతో మృతి చెందిందని, సిఐ మల్లికార్జునరావు బలవంతపు కేసులుపెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఐఆర్‌ఇఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ఇమ్మానియేలు రెబ్బా ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం హాస్టల్ నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వార్డెన్‌లు బస్టాండ్ వరకు సిఐకు వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా ఎస్‌ఐ సురేష్ అనుమతిలేకుండా ర్యాలీలు నిర్వహించరాదని అడ్డుకున్నారు. ఎస్‌ఐ సురేష్ తహశీల్దార్ ఎం నాగిరెడ్డికి ఫోనుద్వారా సమాచారం అందించగా ఆయన బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. యాజమాన్యం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసి ప్రదర్శనను విరమించుకుంది.