గుంటూరు

కెఎంపిఎల్ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మార్చి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుంటూరు రీజియన్ పరిధిలో నిర్దేశించిన కెఎంపిఎల్ లక్ష్యాలను డ్రైవర్లు అధిగమించాలని ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం ఆర్‌ఎం తన ఛాంబర్‌లో రీజియన్‌లోని డ్రైవర్లకు ఇంధనవర్షిణి పుస్తకాన్ని ఆవిష్కరించి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ ప్రతిభ, నైపుణ్యత, ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసి కెఎంపిఎల్‌ను 5.50 నుండి 6 వరకు టార్గెట్ సాధించి నెలకు 2 వేల రూపాయల వరకు ఇనె్సంటివ్ పొంది ఆదర్శంగా నిలవాలన్నారు. ఇంధన పొదుపే డ్రైవర్‌కు శ్రీరామరక్ష అని, స్మార్ట్ డ్రైవింగ్ స్కిల్ సంస్థకు రక్ష అని తెలిపారు. ప్రతి బస్‌స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కువ మందిని ఎక్కించి ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సు నిలిపి, ప్రయాణికుల మన్ననలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డిప్యూటీ సిటిఎం వెంకటేశ్వరరావు, ఎఎంపి శ్రీనివాసరావు, 13 డిపోల సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌లలో అక్రమాలకు పాల్పడితే
సహించేది లేదు
అమరావతి, మార్చి 28: మండల పరిధిలోని మల్లాది, దిడుగు, ఇసుక రీచ్‌లలో ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సత్తెనపల్లి డిఎస్‌పి మధుసూదనరావు హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని మల్లాది, దిడుగు గ్రామాల్లోని ఇసుకరీచ్‌లను ఆయన పరిశీలించి పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. ఇసుక తవ్వకాలను పర్యవేక్షించే అధికారులతో కూడా చర్చించి అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట అమరావతి ఎస్‌ఐ కె వెంకటప్రసాద్, ఎస్‌ఐ చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.