గుంటూరు

రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 29: రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన చేస్తూ సంక్షేమ పథకాలకు తిలోదకాలిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ మేరుగ నాగార్జున ఆరోపించారు. మంగళవారం స్థానిక అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాలన గాడితప్పిందని ప్రతిపక్షాలు గొంతెత్తి చాటినా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14వ తేదీన ఉత్సవాలు జరపనున్నట్లు తెలిపారు. అలాగే ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్‌రామ్ జయంతిని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి ఓ విశిష్ఠత ఉందన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా దేశంలో, రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఖురాన్, బైబిల్, భగవద్గీతల మాదిరిగా రాజ్యాంగాన్ని కూడా పవిత్రగ్రంథంగా అందరూ భావించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.