గుంటూరు

ఎంపి నిధులతో చేపట్టిన పనులు పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 2: గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎంపి నిధులతో చేపట్టిన పనులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తిచేయాలని పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అధికారులను కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, కృష్ణా పుష్కరాలు, వేసవికాలంలో మంచినీటి సమస్యపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి ఎంపి గల్లా జయదేవ్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎంపి జయదేవ్ మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సమస్య నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఎస్‌సి కెనాల్ ద్వారా మంచినీటి అవసరాలకు విడుదల చేసిన నీటితో నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను నింపాలన్నారు. గుంటూరు నగరానికి 540 కోట్ల రూపాయలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పథకాన్ని కాల పరిమితిలో పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథం కింద లబ్ధిదారుల నుంచి వచ్చిన పలు దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి జాబితాలు సిద్ధంచేయాలన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఎంపి నిధులతో చేపట్టిన పనులను అధికారులు పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు. గుంటూరు నగరం నుండి పుష్కర ఘాట్‌లకు వెళ్లే రహదారుల విస్తరణ పనులను ప్రణాళికాయుతంగా పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ నాగబాబు, ఆర్‌డిఒ భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు.