గుంటూరు

గుడ్లకమ్మనదికి సాగర్‌జలాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొల్లాపల్లి, ఏప్రిల్ 4: వినుకొండ నియోజక వర్గంలోని గుండ్లకమ్మనది పరివాహక గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు గుట్లపల్లి లాకుల వద్ద గేట్లు ఎత్తి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ కుడికాల్వ పరిధిలోని గుట్లపల్లి వద్దకు ఎమ్మెల్యే జీవీ, ఇరిగేషన్ అధికారులతో మధ్యాహ్న సమయంలో కెనాల్‌కు చేరుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించిన అనంతరం సాగర్ జలాలను గుండ్లకమ్మనదికి విడుదల చేశారు. దీంతో గుండ్లకమ్మనది పరివాహక ప్రాంతాలలోని ప్రజలకు తాగునీటి అవసరాలు కొంత మేర తీరనున్నది. మూడు రోజులపాటు గుండ్లకమ్మకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరగా అందుకు అధికారులు ససేమిరా అన్నారు. మంత్రి ఆదేశాల మేరకు మాత్రమే 24 గంటలు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే జీవీ వెంట నరసరావుపేట ఆర్డీవో శ్రీనివాసరావు, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎన్‌ఎస్పీ అధికారులు, టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మంచినీటి చెరువులకు జలకళ
పెదకూరపాడు, ఏప్రిల్ 4: వేసవిలో మంచినీటి ఎద్దడిని అధిగమించేందుకు అన్ని గ్రామాల చెరువులను నీటితో నింపేందుకు ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేయ డం జరిగింది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో గత 5 రో జులుగా ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో మండలంలోని పెదకూరపాడు, లింగంగుంట్ల, పొడపాడు, జలాల్‌పురం, పాటిబండ్ల, బుచ్చయ్యపాలెం, అబ్బరాజుపాలెం, లగడపాడు, కంభంపాడు, ముస్కాపురం, చిన్నమక్కెన్న గ్రామాల చెరువులను ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటీసి సభ్యులు కలిసి పరిశీలించారు. పెదకూరపాడులో తాగునీటి చెరువులు నీటిని నింపే కార్యక్రమాన్ని నీరు మీరు ఛైర్మన్, మం డల టిడిపి అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో 5 రోజులుగా మంచినీటి చెరువు వద్ద రేయింబవళ్లు మకాం వేసి 25 ఇంజన్లతో చెరువు నింపే కార్యక్రమం జరిగింది. మాజీ మార్కెట్ ఛైర్మన్ రామాగోపాలరావు, వేమూరి వెంకటప్పయ్య, యార్డు డైరెక్టర్ బ్ర హ్మయ్య, భాష్యం ఆంజనేయులు, డిస్ట్రిబ్యూషన్ ఛైర్మన్ అ ప్పారావు, చెరుకూరి శంకర్, ఏటుకూరి శివయ్య, పుల్లయ్య, వెంకటేశ్వర్లు, శివయ్య, శ్రీనివాసరావు, కరిముల్లా, ఎంపిటిసి హమీద్, నరసింహారావు, పాములయ్య తదితరుల సహకారంతోఈ కార్యక్రమం జరిగింది. సోమవారం ఎంపిడిఓ గీతారాణి గ్రామాల్లో పర్యటించి సంతృప్తిని వ్యక్తం చేశారు.