గుంటూరు

భారతీయులకు సమతా విలువను ప్రబోధించిన అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఏప్రిల్ 9: భారతీయులకు సమాతా విలువలను రాజ్యాంగం ద్వారా ప్రబోధించిన స్ఫూర్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ ఆర్ అంబేద్కర్ అ ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి మనోహ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎన్‌జిఓ కళ్యాణ మండపం లో సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో శనివా రం నిర్వహించిన జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోహ మాట్లాడుతూ దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఎస్సీ, ఎస్టీలు దేవుడిగా కొలిచే అంబేద్కర్ జీవి తం ప్రతి భారతీయునికి ఆదర్శమన్నారు. ప్రొఫెసర్ శ్రీనివాసులు ‘్భరత రాజ్యాంగం, సిద్ధాంత, ఆచరణ’ అనే అంశంపై మాట్లాడుతూ రాజ్యాం గం ముసాయిదా సమర్పించిన సమయంలో మన దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వం లేదని, కేవ లం రాజకీయ సమానత్వం మాత్రమే ఉందని, ఇది వైరుఢ్యాలకు దారితీస్తుందని నాడు అంబేద్కర్ చేసిన హెచ్చరికలు నేడు వాస్తవమయ్యాయన్నారు. ‘బౌద్ధ, బ్రాహ్మ ణ వాదం’పై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బుద్ధిస్ట్ స్టడీస్ డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ బౌద్ధ సమానత్వ విలువలకు, బ్రాహ్మణవాద అవసమానత్వ విలువలకు మధ్య భారతదేశంలో 2500 సంవత్సరాలుగా ఘర్షణ జరుగుతూనే ఉందన్నారు. ఎస్‌వియు ఆచార్యులు డాక్టర్ నాగులూరి ద యాకర్ ‘పౌర సమాజం, అంబేద్కర్’ అనే అంశంపై మాట్లాడుతూ కుల నిర్మూలన ద్వారానే భారత జాతి నిర్మాణం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తొలుత స్థానిక ఐతానగర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పెద్దలు, సామాజిక పరివర్తన సభ్యులు బైకు ర్యాలీతో ఎన్‌జిఓ కళ్యాణ మండపానికి చేరుకున్నారు.
ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంత పోరు: రఘువీరా
మంగళగిరి, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున అవిశ్రాంతంగా పోరాడుతామని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. శనివారం మంగళగిరిలో కాంగ్రెస్ నేత కుమారుడి వివాహానికి హాజరైన సందర్భంగా అక్కడ విలేఖర్లతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయడంలో నరేంద్రమోదీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. బిజెపి, టిడిపి, వైఎస్‌ఆర్‌సీపీ విధానాలన్నీ ఒకేవిధంగా ఉన్నాయని రఘువీరారెడ్డి అన్నారు. భవిష్యత్తులో వామపక్షాలతో కలిసి ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లపాలన అవినీతిమయం అయిందన్నారు. జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు, ఉడా మాజీచైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జంజనం భిక్షారావు, కాంగ్రెస్ నాయకుడు షేక్ సలీం, ఆకుల శ్రీనివాస్, దామర్ల కుబేరస్వామి, పూర్ణచంద్రరావు, సాంబిరెడ్డి, అప్పికట్ల శ్రీహరినాయుడు, గట్టెం నాగేశ్వరరావు, సత్యనారాయణ, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.