గుంటూరు

పూలే జీవితం ఆదర్శనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావుపూలే కొనసాగించిన ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రామాణికంగా తీసుకుని అందరూ అనుసరించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. భారత సామాజిక విప్లవోద్యమపిత మహాత్మా జ్యోతిరావుపూలే 190వ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆద్వర్యంలో స్థానిక వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుపూలే విద్యాభివృద్ధి కోసం అనుసరించిన మార్గాలను స్ఫూర్తిగా తీసుకుని నవసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పూలే ఆశించిన విధంగా విద్యావంతమైన సమాజం రావాలన్నారు. ఆయన ఆశయాల సాధనకు అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన తరగతుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధ్యక్షత వహించిన గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పూలే ఆశయాలను నిత్యం అనుసరించే విధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాలను తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న జీవితచరిత్రతో కూడిన పుస్తకాలను అధ్యయనం చేయాలన్నారు. విద్యాభివృద్ధి కోసం ఆయన అనుసరించిన మార్గాలు ఇప్పటికీ అందరికీ ఆదర్శనీయమన్నారు. శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావులు మాట్లాడుతూ సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు పూలే విధానాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్ర్తిలకు విద్య అవసరమని, నాడే గుర్తించి, ఆ దిశగా నిరుపమాన సేవలందించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ బిసిల ఆర్థికాభివృద్ధి కోసం త్వరితగతిన రుణాలు మంజూరు చేసేవిధంగా బ్యాంకు అధికారులను ఆదేశించాలని కలెక్టర్‌ను కోరారు. గుంటూరు మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లాలో ఏర్పాటుచేసిన మహాత్యా జ్యోతిరావుపూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లా వద్ద గల జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో జ్యోతిప్రజ్వలన చేసి అక్కడ ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి జేమ్స్ ఇన్నయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.