గుంటూరు

భూమి, భుకి,్త విముక్తికి విప్లవమే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 11: భూమి, భుక్తి, దేశవిముక్తి కోసం నూతన ప్రజాస్వామిక విప్లవమే మార్గమని దానికోసమే తుదిశ్వాస వరకు పోరాడి నిలబడిన వ్యక్తి పైలా వాసుదేవరావు అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఎన్ బ్రహ్మయ్య పేర్కొన్నారు. సోమవారం అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పైలా వాసుదేవరావు 6వ వర్ధంతి సభ బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగింది. సభలో బ్రహ్మయ్య మాట్లాడుతూ శ్రీకాకుళ సాయుధ పోరాట ఉద్యమ నిర్మాతలలో ఒకరిగా, పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పైలా వాసుదేవరావు పోషించారని, పీడిత ప్రజల ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం 42 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపిన ధైర్యశాలి పైలా అని పేర్కొన్నారు. ఈ సభలో ప్రగతిశీల న్యాయవాదుల వేదిక జిల్లా కన్వీనర్ శిఖా సురేష్‌బాబు, అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇందుర్తి సుబ్బయ్య, ప్రగతిశీల మహిళాసంఘం గుంటూరు డివిజన్ కార్యదర్శి పి శివపార్వతి, నాయకులు గంధం శ్రీనివాసరావు, ముద్రబోయిన రామారావు, ఇందుర్తి చిన్నసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.