రాష్ట్రీయం

నేడు నగరానికి గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాహ్నం 12 గంటలకు కుత్బుల్లాపూర్‌కు నీళ్లు
హైదరాబాద్, నవంబర్ 26: జంటనగరవాసుల దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలు నేడు నగర ప్రవేశం చేయనున్నాయి. మధ్యాహ్నం పనె్నండు గంటల కల్లా కుత్బుల్లాపూర్‌కు గోదావరి జలాలు చేరుకుంటాయని, ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ శివారు ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. ఇప్పటికే రెండురోజుల క్రితం ఘన్‌పూర్‌కు చేరుకున్న 28 ఎంజిడిల నీటిని మంజీరా మొదటి, మూడో దశ పైప్‌లైన్ వ్యవస్థతో అనుసంధానం చేసే పనులు పూర్తయ్యాక, శుక్రవారం మధ్యాహ్నం పనె్నండు గంటల తర్వాత తొలి దశగా కుత్బుల్లాపూర్‌కు గోదావరి జలాలు వచ్చే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేశారు. కుత్బుల్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుకున్న జలాలను అక్కడినుంచి అల్వాల్, శేరిలింగంపల్లిలకు తరలిస్తారు. హైదరాబాద్ మహానగర తాగు నీటి అవసరాల కోసం 2007లో అప్పటి ప్రభుత్వం రూ. 3,375 కోట్లతో చేపట్టిన వౌలానా అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఈ జలాలను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే! గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి విడత కింద నగరానికి రావల్సిన 48 ఎంజిడిల్లో ప్రస్తుతం 28 ఎంజిడిలను తీసుకువస్తున్నారు.