వరంగల్

ఇక ఓరుగల్లుకు గోదావరి గలగలలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నేడు చారిత్రాత్మక ఘట్టానికి నాంది
* రండి.. సిఎం కెసిఆర్‌కు స్వాగతం పలుకుదాం...
* టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు
వరంగల్, మార్చి 7: ఓరుగల్లుకు మహర్దశ పట్టనుంది. గోదావరిపై ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికై ముఖ్యమంత్రి కెసిఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ముంబాయిలో నేడు (మంగళవారం) గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణంపై సంతకాలు చేసుకునే సుదినం తెలంగాణలో చారిత్రాత్మకంగా మిగిలిపోతుందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సమైక్య పాలనలో నీటి పంపకాల్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. గోదావరి నీళ్లు తెలంగాణలో వినియోగం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అందుకు అవసరమయ్యే ప్రాజెక్టులను ఆంధ్రా పాలకులు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ గోదావరి నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణకు నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపారన్నారు. గోదావరిపై ఐదు బ్యారేజీలు నిర్మాణం కానున్నాయని ఆయన తెలిపారు. ఒప్పందంపై సంతకాలు చేసుకుని మంగళవారం సిఎం కెసిఆర్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయానికి తెలంగాణవ్యాప్తంగా ఉన్న పది జిల్లాల నుంచి 50వేల మంది టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సిఎంకు స్వాగతం పలికేందుకు తరలిరావాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.20వేల కోట్లు కేటాయిస్తుందన్నారు.
వరంగల్ గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తాం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 58 డివిజన్లకుగాను 54 డివిజన్లలో విజయఢంకా మోగించి గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలే వరంగల్‌లో గ్రేటర్‌లో రాబోతున్నాయని తెలిపారు. వరంగల్ ప్రజలు టిఆర్‌ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారని, ఎన్నికల పోలింగ్ సరళి టిఆర్‌ఎస్‌కు పూర్తి అధిక్యత ఉందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు కోళ్ల జనార్ధన్, చేవెల్లి సంపత్, కరిమల్ల బాబురావులు పాల్గొన్నారు.