హైదరాబాద్

అగ్నిప్రమాదంలో యజమాని దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 12: జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లి శివారులోని కెమికల్ గోదాములో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో యజమాని సజీవ దహనమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడ మండలం పెనుపాక గ్రామానికి చెందిన పి.వెంకట్‌రెడ్డి చింతల్ గణేశ్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఇతనికి భార్య శివకుమారి, సాయితేజ, రుద్రాక్ష సంతానం ఉన్నారు. సుమారు 15 సంవత్సరాలుగా శ్రీసాయిరాం కెమికల్స్ ట్రేడింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈనెల 8న రాత్రి శ్రీసాయిరాం కెమికల్స్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. వెంకట్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయగా భార్య శివకుమారితో ఎక్కువ సార్లు మాట్లాడినట్లు నిర్ధారించారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా అగ్ని ప్రమాదం జరిగిన రోజున అక్కడికి వెళ్లిన వెంకట్‌రెడ్డి తిరిగి రాలేడని పోలీసులకు తెలిపింది. కాగా గోదాము వద్ద స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పేట్‌బషీరాబాద్ ఎసిపి అశోక్‌కుమార్, సిఐ డివి రంగారెడ్డిలు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వెంకట్‌రెడ్డి పాకెట్ పర్స్, రూ.50 వేలనగదు, టీషర్ట్‌ను గుర్తించారు. సిసి కెమెరా ఫుటేజీ, గోదాములో దొరికిన ఆధారాల మేరకు పోలీసులు వెంకట్‌రెడ్డి అని నిర్ధారించారు. అక్కడ ఉన్న శకలాలను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.