ఆంధ్రప్రదేశ్‌

దేవుడి వెండి బంగారంగానూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో వృథాగా పడివున్న వెండి వస్తువులను బంగారంగా మార్పిడి చేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. వెండి డిపాజిట్ల వల్ల ఆదాయం లేకపోగా, అదనంగా భద్రతకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో దాతలిచ్చిన వెండి వస్తువులు వృథాగా ఉంటున్నాయి. కొన్ని ఆలయాలు వాటిని హైదరాబాద్‌లోని మింట్‌లో కరిగించి వెండి కడ్డీలుగా మారుస్తున్నాయి. వాటిని బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తున్నాయి. బ్యాంక్ లాకర్లలో భద్రపరచిన వెండి ద్వారా ఆదాయం లేకపోగా, అదనంగా లాకర్ల ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఆలయాల్లోనే ఉంచితే భద్రతకూ ఖర్చు భరించాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో వృథాగా ఉన్న వెండి నిల్వల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు దేవాదాయ శాఖ కొత్త ఆలోచనకు తెరలేపింది. ఆ ప్రకారంగా వివిధ ఆలయాల్లో ఉన్న వెండి వస్తువులను హైదరాబాద్‌లోని మింట్‌కు తరలించి వెండికడ్డీలుగా మారుస్తారు. ఇప్పటికే ఉన్న వెండికడ్డీలు సహా, కొత్తగా తయారు చేయించిన వాటిని కలిపి బహిరంగ వేలం వేస్తారు. వీలైనంత ఎక్కువ ఆదాయం వచ్చేలా ఇ-వేలం కూడా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి దేవస్థానాల ఇవోలు, జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి, ఆర్‌జెడి, ఎంఎంటిసి ప్రతినిధి, ఇద్దరు బ్యాంక్ అధికార్లతో కమిటీని నియమించారు. వెండి కడ్డీలను వేలం వేశాక వచ్చిన సొమ్ముతో బంగారాన్ని బులియన్ మార్కెట్, లేదా బ్యాంకుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ బంగారాన్ని ఎస్‌బిఐలో గోల్డ్ బాండ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయనుంది. దానిపై వచ్చే వడ్డీ కూడా బంగారం రూపంలోనే ఉండేలా దేవాదాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం జూలై 31లోగా పూర్తిచేయాలని అధికారులను దేవాదాయ శాఖ ఆదేశించింది.