తెలంగాణ

నిజంగా బంగారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ జిఎస్‌డిపి 11.7 శాతం దాటుతుందని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడి

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారమే. సేవల రంగంలో వాటా 60.5 శాతం, ఉపాధి 26.6 శాతం కల్పిస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంది. తెలంగాణ రాష్ట్ర స్ధూల రాష్ట్ర జాతీయోత్పత్తి రేటు సాలీనా 11.7 శాతం చొప్పున వృద్ధిరేటుతో దూసుకుపోతుందని తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. తెలంగాణ జిఎస్‌డిపి రూ.5.83 లక్షల కోట్లు. 2011-12 ధరల ప్రకారం ఇది రూ.4.69 కోట్లు. గత ఏడాది జిఎస్‌డిపి 9.2 శాతం ఉండగా, తాజా అభివృద్థి సూచికల ప్రకారం 11.7 శాతం వృద్ధిరేటుతో పెరుగుతోందని సర్వే ప్రకటించింది. 2015-16లో తెంలగాణ ఆర్ధిక వాటా 4.1 శాతం. 2012-13లో అఖిల భారత వృద్ధిరేటు 5.62 శాతం ఉండగా, తెలంగాణ వృద్ధిరేటు కేవలం 2.41 శాతం ఉండేది. కాని 2013-14 నుంచి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వేగం పుంజుకుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఆర్ధికాభివృద్ధి కార్యకలాపాలు కొత్త మలుపు తిరిగాయి. జాతీయ వృద్ధిరేటు 7.57 శాతం ఉండగా, తెలంగాణ వృద్ధిరేటు 9.24 శాతానికి చేరుకుంది.
ఆర్ధిక రంగాన్ని శాసించే మూడు విభాగాల్లో వ్యవసాయం ఉండే ప్రైమరీ సెక్టార్‌లో వృద్ధిరేటు -1.9 నమోదుకాగా, సెకండరీ విభాగంలో మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 8.6శాతం నమోదైంది. కాగా సర్వీసు రవణా, కమ్యూనికేషన్లు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వాణిజ్య, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర రంగాల్లో వృద్ధిరేటు 11 శాతం నమోదైంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న కరవుకాటకాల వల్ల ప్రైమరీ రంగంలో వ్యవసాయంలో నెగెటివ్ వృద్ధిరేటు 18.2 శాతం నమోదైంది. కాగా ఈ లోటు పశుపోషణలో 12.2 శాతం, మత్స్యసంపదలో 17.8 శాతం, క్వారీయింగ్‌లో 6.9 శాతం వృద్ధిరేటు ద్వారా నమోదైంది.
తలసరి ఆదాయంలో హైదరాబాద్ అగ్రగామి
తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో రూ.1.29 లక్షలుగా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో తలసరి ఆదాయం రూ.2.94 లక్షలు నమోదైంది. ఆ తర్వాత స్ధానాల్లో రంగారెడ్డి, మెదక్, నమోదయ్యాయి. ఆదిలాబాద్ తలసరి ఆదాయంలో చివరి స్ధానంలో నిలిచింది. ఆదిలాబాద్ తలసరి ఆదాయం రూ. 76,921. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,039, మెదక్ జిల్లా తలసరి ఆదాయం రూ.1,21,33గా నమోదైంది.
రాష్ట్రంలోని జిఎస్‌డిపిని విశే్లషిస్తే వ్యవసాయం క్షీణిస్తోంది. 2011-12 ధరల ప్రాతిపదికను చూస్తే స్ధూల విలువ ఆధారిత రేటు (జివిఏ) వ్యవసాయం వాటా 12.9 శాతం నమోదైంది. దాదాపు 55.6 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. జివిఏలో సర్వీసు రంగం వాటా 60.5 శాతం నమోదైంది. ఈ రంగంలో 26.6 శాతం మంది పనిచేస్తున్నారు. జివిఏలో పరిశ్రమల వాటా 26.7 శాతం, కాగా 17.8 శాతం మంది జీవిస్తున్నారు.