జాతీయ వార్తలు

సత్సంబంధాలు కొనసాగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే రెండు దేశాల అభివృద్ధికి బాటలు వేస్తుంది
తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాల పునరుద్ధరణ జరిగితే తప్ప రెండు దేశాలు అభివృద్ధి చెందలేవని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినాయకుడు ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. రెండు దేశాల నేతలు సావధానంగా చర్చించుకుంటే అన్ని సమస్యలూ సమసిపోతాయని ఆయన చెప్పారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడుతూ, పాక్‌లోనేకాక భారత దేశంలోని అత్యధిక శాతం ప్రజలు రెండు దేశాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఢిల్లీ వచ్చిన వెంటనే తాను ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రెండు దేశాల చర్చల ప్రక్రియకు చొరవ తీసుకోవాలని కోరానని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించడం వల్ల తీవ్రంగా నష్టపోయామన్న నిజాన్ని పాక్ ప్రజలు గ్రహించారని ఆయన చెప్పారు. ఆర్మీ స్కూల్‌పై తాలిబన్లు దాడిచేసి 150 మంది పిల్లలను దారుణంగా హత్యచేసిన రోజునుంచి పాక్ ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో ఉగ్రవాదులపై ఆగ్రహం పెరిగిపోయిందని ఇమ్రాన్ తెలిపారు. చర్చల ప్రక్రియ మొదలై రెండు దేశాల మధ్య చిన్నపాటి ఒప్పందాలు కుదిరినా చర్చలను వ్యతిరేకించేవారు తమ ఉనికిని కొల్పోతారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య వ్యాపారం ప్రారంభమైతే వేలాదికోట్ల రూపాయల ఆర్జనకు వీలుపడుతుందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో పటిష్టంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి అనేక సంస్థలు ఉన్నాయి. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్ధ రోజురోజుకు బలోపేతం అవుతోందని ఆయన చెప్పారు. పాక్ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఘోరంగా విఫలం కావటంవల్లే దేశంలో దారుణమైన పరిస్థితులు ఏర్పాడ్డాయని ఆయన అన్నారు. భారత దేశంలోఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి, అధికారం సాఫీగా బదిలీ అయిపోతుంది. సుప్రీమ్ కోర్టు తన ప్రాధాన్యతను నిరూపించుకుంటోంది. పాక్‌లో ఇలాంటి పరిస్థితి లేదు. ఉగ్రవాదులను విచారించి శిక్షించటానికి మిలిటరీ కోర్టులను ఏర్పాటు చేయవలసి వచ్చిందని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య జరిగే చర్చలలో కాశ్మీర్ వివాదం ప్రధాన అవరోధంగా ఉందని ఆయన అంగీకరించారు. ఈ విషయం ప్రస్తావనకు రాగానే చర్చలు ఆగిపోవటం రివాజుగా మారింది. మనం ఏదో ఒక విధంగా ముందుకు వెళ్దామా లేక వివిధ అంశాలను ముడిపెట్టి చర్చలను నిలిపివేద్దామా అన్న విషయంపై ఒక నిర్ణయానికి వస్తే, తరువాతి అడుగు ఎలా వేయాలో ఆలోచించటానికి వీలుపడుతుందని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.