నల్గొండ

గోపాలమిత్రల నిరసన ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ , జనవరి 1: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ గోపాలమిత్రలు స్థానిక గడియారం సెంటర్‌లో గోపాలమిత్రల రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం బైక్‌లతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15సంవత్సరాల నుండి గోపాలమిత్రలుగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు తలలో నాలుకలా మెలుగుతూ గొర్రెలు, మేకల, పశువుల పెంపకంపై జాగ్రత్తలు, సూచనలు అందిస్తూ పశు సంవర్దక శాఖకు, రైతులకు వారధిగా పనిచేస్తున్నామన్నారు. కృత్రిమ గర్బోత్పత్తి, మేలు జాతి సంతతి జీవాల సంతతి ఉత్పత్తి, రోగనిరోధక టీకాలు, ప్రథమ చికిత్స, నట్టల మందులు తాగించడం, రైతులకు పశుగ్రాసంపై అవగాహన కల్పించటమే కాక జీవాలకు బీమా చేయించడం లాంటి పనులు నిర్వహిస్తూ రైతులకు ఇంటి వద్దనే సేవలందిస్తున్నామని గమనించాలని కోరారు. రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో సైతం సేవలు చేసి పాల ఉత్పత్తిని పెంచేందుకు తోడ్పడుతున్న తమకు కేవలం 3వేల 5వందలు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంభానికి బీమా సౌకర్యం కల్పించాలని ఆఫీస్ సబార్డినేట్ ఓఎస్ లలో 50శాతం కోటా కల్పించి నియమించాలని కనీస వేతనంగా 16వేల 5వందలు చెల్లించడమే కాకుండా 5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు శనివారం నుండి గోపాలమిత్రల ఆధ్వర్యంలో జిల్లా పశుగణాభివృద్ధి కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జె. యాదగిరి ఉపాధ్యక్షులు గోవింద్, శంభులింగం, గోపాల మిత్రల బృందం పాల్గొన్నారు.