ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో గోపీచంద్‌ అకాడమీకి 15 ఎకరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : అమరావతి స్పోర్ట్స్‌ సిటీలో కోచ్ గోపీచంద్‌ అకాడమీకి 15 ఎకరాలు కేటాయిస్తాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన సింధుకు మంగళవారం విజయవాడలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే మనకు గుర్తింపు రాదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోపీచంద్ అకాడమీ ఏర్పాటుకు గచ్చిబౌలీలో 5 ఎకరాల స్థలం ఇచ్చి ప్రోత్సహించానని, గొపీ ఏర్పాటు చేసిన అకాడమీలో ప్రాక్టీస్‌ చేసిన సింధు పతకం గెలిచిందని అన్నారు. గోపీచంద్‌కు ఏయూ (ఆంధ్రా యూనివర్శిటీ) గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం హర్షనీయమన్నారు. క్రికెట్‌ మాత్రమే కాకుండా అన్ని క్రీడలకు ప్రాధాన్యత పెరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ల్‌లో పతకం సాధించకపోయినా బాగా ప్రతిభ కనబరిచాడని కిదాంబి శ్రీకాంత్‌కు కితాబిచ్చారు. ఆయనను కూడా ప్రోత్సహించేందుకు రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న రజినీకి కూడా రూ.25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అందరిలో స్ఫూర్తి నింపడానికే ప్రోటోకాల్‌ పక్కనపెట్టి మరీ పీవీ సింధుకు స్వాగతం చెప్పానని అన్నారు. క్రీడలకు కేంద్రంగా అమరావతిని తయారు చేస్తామన్నారు.