రాష్ట్రీయం

గోరక్షతోనే జాతికి భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులమత వ్యవహారం అనుకోవద్దు * చట్టాలను గట్టిగా అమలు చేయాలి
మతం, మందిరంతో గోవిశిష్టతను చాటాలి * స్వామి పరిపూర్ణానంద ఉద్బోధ
హైదరాబాద్, డిసెంబర్ 10: గోరక్ష అనేది ఓ మతం, కులం అనుకోవద్దని గోరక్షతోనే జాతి, దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గోరక్ష దివస్‌ను పురస్కరించుకుని గురువారం పరిపూర్ణానంద స్వామి బిజెపి ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గోశాలలో గోవులకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి ప్రసంగిస్తూ దేశంలోని 24 రాష్ట్రాలు గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్నాయని, మిగిలిన 5 రాష్ట్రాల్లో చట్టం అమలు కాకపోవటం వల్ల రోజుకి 50 నుంచి 60 వేల గోవులను వధించి, వాటి మాంసాన్ని ఎగుమతి చేస్తున్న సంస్థలు అనధికారికంగా, అప్రకటితంగా 30వేల పైచిలుకు ఉన్నాయన్నారు. పిజ్జాలు, బర్గర్‌లు తినొద్దంటూ మీడియా చేస్తున్న విస్తృత ప్రచారాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొంటూ, అదేవిధంగా మీడియా తన బాధ్యతగా, కర్తవ్యంగా గోసంరక్షణకు కృషి చేయాలన్నారు. గోవును రక్షించటం ఓ మతాన్నో, కులాన్నో వెనకేసుకురావటం కానేకాదని స్వామి వాదించారు. ఇందుకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గోవులను తినొద్దనటం దళిత వ్యతిరేకం అనుకోవద్దని, ఎవరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా హిందూ ధర్మం అందర్నీ అక్కున చేర్చుకుంటుందన్నారు. గోవులను పూజించాలన్న మహోన్నత భారతీయ సంస్కృతిని గౌరవించాలని, పూజించకపోయినా కనీసం గోవును గౌరవించటం నేర్చుకోవాలన్నారు. ప్రతి హిందువు గోవు విశిష్టతను గోశాల, దేవాలయాల ద్వారా, మతాలు, మందిరాల ద్వారా చాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 10వ తేదీని గోరక్ష దివస్‌గా ప్రకటించి, గోరక్ష విషయంలో కఠినమైన చట్టాలను అమలు చేస్తామని చెప్పినట్లు ఆయన వివరించారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని వెలుగులోకి తెచ్చి, చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పరిపూర్ణానంద స్వామి విజ్ఞప్తి చేశారు. గోరక్ష అనేది మతం అనుకోవద్దని, ఇది జాతి, దేశ భవిష్యత్తు అని, మనందరి ఆత్మాభిమానమని, ఆత్మగౌరవమని స్వామి అభివర్ణించారు. (చిత్రం) గోరక్ష దివస్ సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గోశాలలో గోవులకు పసుపు, కుంకుమలతో పూజలు జరిపిన పరిపూర్ణానంద స్వామి