జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, అరుణ్‌జైట్లీ గౌతమ్ గంభీర్‌కు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గౌతమ్ గంభీర్ జాతీయ భావాలు కలిగివున్నారు. ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు తెరదించుతూ పార్టీలో చేరారు. 37 ఏళ్ల గంభీర్ 13 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించారు. ఇన్నాళ్లు క్రికెట్ ఆటతో దేశానికి సేవ చేశానని, ఇక రాజకీయాల ద్వారా సేవ చేయనున్నట్లు గంభీర్ తెలిపారు. తనకు పార్టీ సభ్యత్వం ఇచ్చిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.