ఆంధ్రప్రదేశ్‌

ఏపీ గవర్నర్‌గా హరిచందన్ ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీ తొలి గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆయన చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశాకు చెందిన హరిచందన్ మంగళవారం సాయంత్రం గన్నవరానికి చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన త్రివిద దళాల వందనాన్ని స్వీకరించారు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.