రాష్ట్రీయం

నీరు అన్నింటికీ మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ నరసింహన్ ఉద్ఘాటన
అనంతపురం, డిసెంబర్ 29: అనంతపురం జిల్లాలోని రామగిరిలో బంగారు గనులు, వజ్రకరూరులో వజ్రాలు, ధర్మవరంలో పట్టుచీరలు లభిస్తున్నా నీరు మాత్రం లేదని, అన్నింటికీ మూలమైన నీటిని తీసుకురావడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించవచ్చని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈయస్‌యల్ నరసింహన్ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ నీరు అన్నింటికీ మూలమని, అనంతలో అన్నీ ఉన్నా నీళ్లు కరవయ్యాయన్నారు. తనకు అనంతపురం జిల్లాలోప్రత్యేక అనుబంధం, సంబంధం ఉందన్నారు. 45 ఏళ్ల క్రితం తాను ఉద్యోగరీత్యా అనంతపురం జిల్లాకు వచ్చానన్నారు. కాలక్రమంలో అనంతపూర్ కాస్త అనంతపురముగా మారిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఆరునెలల అనంతరం అనంత సంతోషపురంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అయితే అందుకు మీ అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. అప్పుడే కరవుపారిపోతుందన్నారు. ఇక్కడకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆరునెలల తరువాత తాను మళ్లీ ఇక్కడకు వస్తానని అప్పటికి అనంతపురం పేరును అనంత సంతోష పురంగా మార్చుకుని ఉండాలన్నారు. మనది ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రని, మీరంతా కలసికట్టుగా ఉండి ఇది మన అందరిదీ అనేలా చేయాలన్నారు. అంతకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఏరియల్ వ్యూ ద్వారా హంద్రీనీవా రెండవ దశ పనులను గవర్నర్ పరిశీలించారు.