రాష్ట్రీయం

విధి నిర్వహణలో రాజీపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొబేషనరి ఐపిఎస్‌లకు గవర్నర్ సూచన
హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ముగ్గురు ప్రొబేషనరి ఐపిఎస్‌లు రాహుల్ హెగ్డే, సిందూ శర్మ, సునీల్‌దత్ శనివారం ఇక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ వారితో ముచ్చటించారు. పోలీసుశాఖలో తన అనుభవాలను వివరించారు. విధి నిర్వహణలో రాజీపడరాదని, సానుకూలంగా ఆలోచించాలని, ప్రజలకు చేరువగా ఉండాలని గవర్నర్ వారికి సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టం గొప్పదని, రూల్ ఆఫ్ లాకు తలొగ్గి పనిచేయాలని ఉద్బోధించారు. కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, ఎంత పని ఒత్తిడి ఉన్నా, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలన్నారు. సివిల్ సర్వీసు అధికారులంటే ప్రజలకు ఎనలేని గౌరవం అని, వారి పట్ల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని చెప్పారు. ఈ సమావేశంలో టిఎస్‌పిఏ డైరెక్టర్ డాక్టర్ ఇషాకుమార్, డిఐజి డి కల్పనా నాయక్, డిఎస్పీ వైవి రమణకుమార్ పాల్గొన్నారు.