రాష్ట్రీయం

కమనీయం.. కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదాద్రి లక్ష్మీనరసింహుడి తిరు కల్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు

నల్లగొండ, మార్చి 17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవ ఘట్టం గురువారం రాత్రి అత్యంత కమనీయంగా వైభవంగా జరిగింది. ఏకశిఖరుడు, స్తంభోద్భవుడైన యాదాద్రి పంచనారసింహుడి కల్యాణోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. రాత్రి 9-40 గంటలకు ప్రారంభమైన స్వామివారి కల్యాణోత్సవానికి హాజరైన గవర్నర్ నరసింహన్ దంపతులు, దేవాదాయ మంత్రి ఎన్.ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి లక్ష్మీనరసింహులకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. జగద్రక్షుడైన యాదగిరీశుడిని, అనంత సిరిసంపదల ప్రదాత లక్ష్మీదేవిలను పట్టువస్త్రాలు, రత్నఖచిత స్వర్ణ్భారణాలతో రమణీయంగా అలంకరించి రాత్రి కల్యాణమండపంలో వధూవరులుగా కొలువుతీర్చి కల్యాణ ఘట్టాన్ని ఆద్యంతం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యుల వేద పండిత బృందం మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవ వేడుకను ఫాల్గుణ శుద్ధ నవమి ముహూర్తంలో శాస్తయ్రుక్తంగా అంగరంగ వైభవంగా జరిపించారు. సృష్టికర్త బ్రహ్మ సారథ్యంలో సకల దేవతల సమక్షంలో లక్ష్మీదేవికి యాదగిరి నరసింహుడు మాంగల్యధారణ చేశారు. స్వామివారల మాంగల్యధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించగా యాదాద్రి దివ్య క్షేత్రం ఆధ్యాత్మికతలో ఓలలాడింది. కల్యాణ లక్ష్మీనరసింహులను గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగించగా భక్తులు స్వామివారలను దర్శించుకుని పులకించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ సునితామహేందర్‌రెడ్డి కల్యాణోత్సవానికి హాజరయ్యారు.