సబ్ ఫీచర్

ప్రభుత్వ విద్యకు సమస్యల గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త విద్యా సంవత్సరం దాదాపు మూడువంతులు పూర్తికా వచ్చింది. కానీ సర్కారు బడుల్లో సమస్యలు తిష్టవేసే వున్నాయి. పాఠశాల భవనాల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, మరుగున పడిన మరుగుదొడ్లు, నీటి సమస్య సక్రమంగా అమలుకాని మధ్యాహ్నభోజన పథకం, అధ్యాపక కొరత ఇలా ఎన్నో ఎనె్నన్నో సమస్యలు విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నాయి అనటం అతిశయోక్తికాదు.
రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల్లో మరెన్నో మండల కేంద్రాల్లోనే భవనాలు లేక తరగతి గదులు చాలక విద్యార్థులు ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. ఒక్కో పాఠశాలది ఒక్కో సమస్య. విద్యార్థుల తల్లిదండ్రులు వలపోవడంవలన మధ్యాహ్నభోజన పథకం కూడా సక్రమంగా అమలుకాని పరిస్థితులెన్నో.. వంట ఏజెన్సీల మహిళలకు కూడా సకాలంలో బిల్లులు అందక ఇబ్బందులుపడుతున్న దాఖలాలు బోలెడన్ని. పాఠ్యపుస్తకాల కొరతతో పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు మరెన్నో. విద్యాశాఖ పర్యవేక్షణ లోపంకూడా కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది.
రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు కోకొల్లలు. చాలా పాఠశాలల్లో మొక్కుబడిగా బిందెడు నీరు పెడ్తారు. మొత్తం ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ ఆ నీరు ఏం సరిపోతాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో కళాశాలల్లో కూడా మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా వుంది. అధికార గణాంకాలకు ఉన్న మరుగుదొడ్లకు పొంతన కుదరడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల మలమూత్ర విసర్జన బాధలు వర్ణనాతీతం. చాలా గ్రామాల్లోని పాఠశాలల్లో తరగతి గదులు చాలక నేలపై విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలు నూరు శాతం బల్లలు లేకుండానే నడుస్తున్నాయి. ఫర్నిచర్ లేని కారణంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణ పరిధిలో ఆరు పురపాలక పాఠశాలలను పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా అధికారులు రద్దుచేసారంటే టేబుళ్ళ సమస్య ఏ స్థాయలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే అనేక జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్న కారణంగా సబ్జెక్టు పూర్తిగా కావడం కష్టంగా వుంటోంది. మంజూరు కావాల్సిన పోస్టులన్నీ ఖాళీగానే వుంటున్నాయి. ఇవన్నీ ఒక సమస్య అయతే చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థుల అభ్యసన ఎంతమాత్రం ముందుకు సాగదు. పాఠశాల అంటే చిన్నారులకు అన్నివిధాలా అనుకూలంగా, విద్య నేర్చుకోవడానికి, ఆటపాటలకు అనువుగా ఉండాలి. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. పాఠశాల ఆవరణలోకి అడుకుపెట్టగానే విద్యార్థి తన కుటుంబం, తాను నివసించే పరిసర ప్రాంతాలను మరచిపోయేలా ఉండాలి. ఇక తరగతి గది వారిలో ఉత్సాహాన్ని, నేర్చుకోవాలన్న తపనను పెంచేదిగా ఉండాలి. దురదృష్ట వశాత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాల్లల్లో దాదాపు తొంబయశాతం వరకు ఇటువంటి వాతావరణమే కనిపించదు. పాఠశాల పరిసరాలే అధ్వాన్నంగా ఉంటాయ. అభ్యసన వాతావరణమే కనిపించదు. దీనికి తోడు ఉపాధ్యాయుల కొరత సరేసరి. చదివే వాతావరణం లేక, చెప్పే ఉపాధ్యాయులు సక్రమంగా లేక విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఎలా కలుగుతుంది? పోనీ ఉన్న ఉపాధ్యాయులైనా పాఠాలను సక్రమంగా చెబుతారా అంటే...అటువంటి వారిని వేళ్లమీద లెక్కించవచ్చు. ఎంతసేపూ రాజకీ యాలు.. ఇతర వ్యాపకాలు. నూటికి 90 మంది తాము పనిచేసే గ్రామాల్లో ఉండరు. తమ పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలల్లో చేరుస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారా? అందువల్ల ఈ సమస్యలన్నింటినీ అధిగమించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని కనీసం రానున్న విద్యా సంవత్సరానికైనా విద్యకు పట్టిన సమస్యల గ్రహణాలను తొలగించే దిశగా పావులు కదపాలని ఆశిస్తున్నాం.

- ఈవేమన