గ్రహానుగ్రహం

ఆరూఢ శోధన అవసరమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్. వేంకటేశ్వర శర్మ, విజయవాడ
ప్ర. ఆరూఢంతో మాతృవైరం వంటి విషయాలు గత సంచికలో వివరించారు. మరి ఆరూఢ శోధనతో ఇంకా ఏమైనా ముఖ్య విషయాలు ఉంటే తెలుపండి.
జ 1. ఆరూఢంతో చాలా విషయ శోధన చేయవచ్చు. ‘బలవచ్ఛ్భుసంబంధోభవేచ్ఛ్భుఫలప్రదః
బలవత్పాప సంబంధో భవేత్పాప ఫలప్రదః’. బలవంతులైన శుభులతోడి సంబంధం ఉన్న గ్రహముల శుభఫలమును ఇచ్చును. బలవంతులగు పాపులతోడి సంబంధం పాప ఫలితములను ఇచ్చును. బలవంతులు అంటే ‘బలవాన్ షడ్బలయుక్తస్సన్’. షడ్బలయుక్తులయిన గ్రహములు బలవంతులైన గ్రహములు. స్థానబలము, చేష్టాబలము, కాలబలము, దిగ్బలము, దృగ్బలము, నైసర్గికబలములను షడ్బలములు అంటారు. శుభగ్రహములు, పాపగ్రహములు అనే వర్గీకరణ విషయం ప్రస్తావిస్తే ఆధిపత్యము ప్రధానం. స్వాభావికంగా గురుశుక్రులు పూర్ణశుభులు. బుధుడు శుభగ్రహమే. కానీ, ‘బుధః పాపయుతః పాపః క్షీణచంద్రసె్తై్ధవచ’ అవడంచేత, అంటే పాపగ్రహములతోకలసిన బుధుడు మాత్రమే పాపగ్రహము. అలాగే పూర్ణచంద్రుడు శుభగ్రహము. క్షీణచంద్రుడు పాపగ్రహము. ‘క్షీణచంద్రుడు’ అనే విషయంలో అనేక పాఠాంతరములు ఉన్ననూ బహుళ ఏకాదశి లగాయతు బహుళ విదియ వరకు క్షీణచంద్రుడుగా వాడకం ఉన్నది. రవి, కుజ, శని, రాహు, కేతువులు పాపగ్రహములు. లగ్నాత్ 1,5,9 స్థానాధిపతులు ఎవరైననూ శుభగ్రహములే. 4,7,10 స్థానాధిపత్యము వచ్చిన పాపగ్రహములు శుభఫలితములు ఇచ్చును. 4,7,10 స్థానాధిపత్యము వచ్చిన శుభగ్రహములు పాపాధిపత్యము ఇచ్చును. ‘త్రిషడాయ పఅత్వం స్యాదశుభత్వప్రయోజకం, రంధ్రవ్యయే శతాచ స్యాదశుభత్వ ప్రయోజకా’ అని ఉన్నది. 3,6,8,11,12 ఆధిపత్యములు లగ్నాత్‌గా వచ్చిన గ్రహములు చెడు ఫలితములే ఇచ్చును.
2. ‘శుభానాం కేంద్రవాసిత్వ శుభదానస్య సాధనం
పాపానాం కేంద్రవాసిత్వమసిమశుభస్మహి సాధనం’. కేంద్రములయందు ఉన్న శుభగ్రహములు శుభఫలితమలను, పాపగ్రహములు, పాప ఫలితములను ఇచ్చును. కేంద్రములు అంటే లగ్నాత్ 1,4, 7, 10 స్థానములు కోణములు, అంటే లగ్నాత్ 1, 5 9 స్థానములు, లగ్నాత్ 2, 5, 8 పణఫరములు, లగ్నాత్ 3, 6, 9, 12 స్థానములు అపోక్లీబములు. లగ్నాత్ 3, 6, 10, 11 స్థానములు ఉపచయస్థానములు అంటారు. ‘స్వమిత్రోచ్ఛక్షేత్ర గత స్తాదృక్సంబంధాన్ బలీ, నీచారిక్షేత్రగస్తాదృక్సంబంధస్తగతోబలః’ స్వక్షేత్రము, మిత్రక్షేత్రము, ఉచ్ఛక్షేత్రమును పొందినవాడు అట్టివారితో సంబంధకలవాడు బలవంతుడు అగును. నీచక్షేత్రమును, శతృక్షేత్రమును పొందినవాడును, అట్టివారితో సంబంధగల గ్రహము అస్తంగత్వము పొందిన గ్రహము దుర్బలుడగును. ‘చరాంశ్ఛరగతాః భేటాః స్థిరాః స్థిరగతానపి స్థిరాస్థిరగతాః భేటాఃచరాచరగతానపి’. చరరాశియందు గ్రహములు చరరాసియందున్న గ్రహములను స్థిరరాశియందు ఉన్న గ్రహములు స్థిరరాశియందు గ్రహములను, అలాగే స్థిరరాశి స్థితిరీత్యా కూడా శోధించి వీక్షణ జ్ఞానమును శోధించవలెను. ఇక పై అంశములను పరిశీలించకుండా రాశి, అష్టకవర్గు, ఆరూఢభావములు ఏవీకూడ శోధింపరాదు. ‘ఆరూఢ లాభే శుక్రేణ దృష్టే రాజా భవేన్నరః తస్మించ్ఛ్భుయుతే సంపద్దారిద్య్రం పాపసంయుతే’. ఆరూఢ లగ్నమునకు లాభస్థానమును శుక్రుడు చూచినేని జాతకుడు భూపతియగును. ఆ లాభస్థానమునందు శుభగ్రహము ఉండెనేని సంపదయు, పాపగ్రహము ఉండెనేని దరిద్రము కలుగును. ‘బలహీనోదేహానాథో యదిస్స్యా ద్వ్యాధిమాన్నరః సకేంద్రకోణగస్స్యాచ్ఛేన్నహ్యధీమాంస్తు కోపవాన్’. తమ స్థానాధిపతి బలహీనుడయిన జాతకుడు వ్యాధిగలవాడు అగును.
3. తను స్థానాధిపతి బలహీనుడై కేంద్ర కోణములయందు ఉండెనేని బుద్ధిమంతుడు కాకపోడుగానీ గోపముగలవాడు అగును. ఆరూఢ లహ్నమనుకు ఏకాదశ స్థానమందు శుభాశుభ గ్రహసంబంధము కలిగిన జాతకుడు సంపన్నుడు కాగలడు. ఆరూఢ లగ్నమునకు ఏకాదశమునందు శుభగ్రహములు ఉన్నఎడల న్యాయమార్గంవలననూ, పాపగ్రహములు ఉన్న ఎడల అన్యాయమార్గము వలననూ లాభము కలుగును. ఆరూఢ లగ్నమునకు ఏకాదశమ్‌దు స్వాచ్ఛమిత్ర గ్రహములు ఉన్నచో వానిదశలయందు విశేషముగా ఐశ్వర్యప్రాప్తికలుగును. ఆరూఢ లగ్నమునకు ఏకాదశ స్థానముతో ఉన్న గ్రహమునకు ఆస్ధానము నీచస్థానము అయినచో ఆ స్థానంలో ఉన్న గ్రహదశలయందు ఆయావ్యయములు సమానముగా ఉండును. ఆరూఢ లగ్నమునకు ఏకాదశ స్థానమునందు రవి, శుక్ర, రాహువు ఉన్న ఎడల రాజువల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగును. ఏకాదశము ఆరూఢ లగ్నమునకు రవి, శుక్ర, రాహువులు ఉండి చంద్రుడు చూచినేని విశేషముగా ఐశ్వర్యము కలుగును. *

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336