గ్రహానుగ్రహం

నవరత్నాలు-జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా నవరత్నాలను అన్నింటినీ కలిపి ధరించుట అందరికీ శ్రేయస్కరమైన విషయమే. అయితే విడివిడిగా ధారణ చేసే విషయంలో మాత్రం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధమైన రత్నాన్ని ధరించినప్పటికీ ఆ రత్నానికి సంబంధించిన గ్రహం యొక్క జపం పూర్తిగా చేయించి ఆ రత్నాన్ని శివుని దగ్గర ఉంచి అభిషేకం చేయించి ఆ గ్రహానికి సంబంధించిన వారములలో కానీ లేదా తారాబలం కుదిరిన రోజులలో కానీ ధరించాలి.
* రత్నాధిపతి శత్రువు అయిన గ్రహ వారములలో రత్నమును కొనుగోలు చేయుట, ధరించుట శ్రేయస్కరం కాదు. ఉదాహరణకు కెంపు కొనుగోలు చేయవలెను అనిన యెడల శుక్ర, శనివారం కొనుగోలు చేయకూడదు. అలాగే పగడం బుధవారం కొనుగోలు చేయకూడదు. ధరించకూడదు. పచ్చ సోమ, మంగళవారాలలో కొనుగోలు చేయకూడదు. ధరించకూడదు. పుష్యరాగం బుధ, శుక్రవారాలలో కొనుగోలు చేయకూడదు. ధరించకూడదు. వజ్రం ఆది, సోమవారాలలో కొనుగోలు చేయకూడదు. ధరించకూడదు. నీలం ఆది, సోమ, మంగళ వారాలలో కొనకూడదు. ధరించకూడదు. అనగా మొదటిసారి ధరించకూడదు అని అర్థం. నిత్యంలో రోజూ చేతికి ఉండవచ్చు. రాహువుకు సంబంధించిన గోమేధికం మరియు చంద్రునికి సంబంధించిన ముత్యం రెంటినీ బుధవారం కొనుగోలు చేయకూడదు. అయితే గోమేధికం ఆదివారం కూడా తగదు. కేతువుకు సంబంధించిన వైఢూర్యం కూడా ఆది, సోమవారాలలో కొనుగోలు చేయుట, ధరించుట తగదు.
* రత్నాలు కొనుగోలు చేసే విషయంలో నక్షత్రాల ప్రాధాన్యత అధికంగా ఉందని చెప్పాలి. సాధారణంగా నక్షత్రానికి సంబంధించిన రీతిలో రాయి చేయించి పెట్టుకొన్నప్పటికీ కలిసి రాలేదని అంటూంటారు కొంతమంది. నక్షత్రానికి సరిపోయిన రాయి ఎందుకు పనికి రావట్లేదు అంటే కొనుగోలు చేసిన వార నక్షత్రాల ప్రభావం, ధరించిన వార నక్షత్రాల ప్రభావం కూడా ఉంటుంది కదా. అందుకని, ఈ క్రింద నక్షత్రాలు ధరించకూడని నక్షత్ర వివరాలివి.
కెంపు: పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ, భరణి, పూర్వాభాద్ర, పుబ్బ నక్షత్ర సమయాలలో ధరించకూడదు. ఈ నక్షత్రాల వారు కూడా ధరించకూడదు.
ముత్యం: ఆశ్రేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర దినములలో ధరించకూడదు. కొనుగోలు చేయకూడదు. ఈ నక్షత్రాల వారు వాడకూడదు.
పగడం: ఆశ్రేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు వాడకూడదు. ఈ నక్షత్ర దినములందు ఈ రాయిని కొనుగోలు చేయుట, ధరించుట తగదు.
పచ్చ: హస్త, శ్రవణం, రోహిణీ నక్షత్ర దినములలో కొనుగోలు చేయకూడదు. ధరించకూడదు. ఈ మూడు నక్షత్రాల వారు ధరించకూడదు.
పుష్యరాగం: ఆశ్రేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారు ధరించకూడదు. ఆ నక్షత్ర రోజులలో కొనుగోలు చేయకూడదు. ధరించకూడదు.
* వజ్రం: ఉత్తర, ఉత్తరాషాఢ, కృత్తిక, రోహిణి, హస్త, శ్రవణా నక్షత్రాల వారు మాత్రం ధరించకూడదు. ఆ నక్షత్ర దినాలలో కొనుగోలు చేయుట, ధరించుట తగదు.

==========
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336