గ్రహానుగ్రహం

రత్నధారణ - లగ్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెంపు: మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనుర్మీన లగ్న సమయముల యందు. రవి 6,8,12 స్థానములలో లేకుండా, రవి శత్రు నీచ క్షేత్రాలలో లేకుండా చూచి ధరించాలి. రాహు, కేతువులు ముహూర్త సమయంలో రవితో కలవకూడదు.
ముత్యం: మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుర్మీనము లందును, చంద్రుడు 6,8,12 స్థానముల యందు లేకుండాను, చంద్రుడు శత్రు, నీచ క్షేత్రములందు లేకుండా చూచి ధరించాలి. రాహు కేతువులు చంద్రునితో ముహూర్త కాలంలో కలవకూడదు.
పగడం: మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుర్మీన లగ్నములందును కుజుడు 6,8,12 స్థానములందు లేకుండాను, బుధుడితో కలియకుండా ఉన్న సమయాన్ని చూచి పగడం ధరించాలి.
గోమేధికం: కర్కాటకం, సింహం, ధనుర్మీన లగ్నాలు కాకూడదు. రాహవు ముహూర్త కాలానికి వీలయినంత వరకు 11వ స్థానంలో ఉంటే మంచిది. గురు రాహువులు రవి రాహువులు చంద్ర రాహువులు కలియకుండా ఉన్న సమయంలో లగ్నం చూచి ధారణ చేయాలి.
పుష్యరాగం: మేష, కర్కాట, సింహ, వృశ్చిక, ధనుః మీన లగ్నముల యందును; గురువు 6,8,12 స్థానములందు లేకుండాను, గురువుకు శుక్ర, శని, రాహు, కేతు సంబంధం లేని సమయంలోను ఉన్న లగ్నంలో ధరించాలి.
నీలం: వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ లగ్నములలో ధరించాలి. శని 3,6,4 స్థానములో ఉండగాను, శనికి గురు, చంద్ర, రవి, రాహు, కేతు కలయిక లేని సమయంలో ఉన్న లగ్నాన్ని చూచి ధరించాలి.
పచ్చ: వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ లగ్న సమయములయందును, బుధుడు 6,8,12 స్థానములలో లేని లగ్నమును కుజ, రవి, చంద్ర, రాహు, కేతువు సంయోగ వీక్షణ లేని లగ్నంలో ధరించాలి.
వైఢూర్యం: కర్కాటకం, సింహం, ధనుర్మీన లగ్నాలు కాకుండాను, కేతువు ముహూర్త కాలానికి వీలయినంత వరకు 11వ స్థానంలో ఉండగాను, గురు కేతువులు, రవి కేతువులు, చంద్ర కేతువులు కలియకుండా ఉండే లగ్న సమయంలో ధారణ చేయాలి.
వజ్రం: మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తులా, వృశ్చిక, మకర, కుంభ లగ్న సమయాలలో శుక్రుడు 6,8,12 స్థానాలలో లేకుండాను గురు, రవి వీక్షణ లేని లగ్న సమయంలోని లగ్నంలో వజ్రధారణ చేయాలి.
కెంపు: రవికి 6,000 జపం, గోధుమలు దానం, ఈశ్వరుని దగ్గర రుద్రాభిషేకం అరుణ పారాయణ చేయించి ధరించాలి. నిత్యం శివాష్టోత్తరం పారాయణం చేసిన యెడల రత్న ప్రభావం పెరుగుతుంది.
ముత్యం: చంద్రునికి 10,000 జపం చేయించి, బియ్యం దానం చేసి - రుద్రాభిషేకం చేయించి గౌరీపూజ చేసి ధరించాలి. నిత్యం గౌరీ అష్టోత్తర పారాయణ చేసిన యెడల రత్న ప్రభావం పెరుగుతుంది.
పగడం: కుజునికి 7,000 జపం చేయించి, కందులు దానం చేసి రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసి ధరించాలి. ఈ రత్నధారణ చేసిన వారు నిత్యం సుబ్రహ్మణ్య అష్టోత్తర పారాయణ చేయాలి.
గోమేధికం: రాహువుకు 18,000 జపం మినుములు దానం చేసి, రుద్రాభిషేకం, దుర్గాపూజ, మహా విద్య పారాయణ చేయించి ధరించాలి. ధరించిన వారు నిత్యం దుర్గా అష్టోత్తర పారాయణ చేస్తే మంచి ఫలితాలు అధికమవుతాయి.
పుష్యరాగం: గురువుకు 16,000 జపం చేయించి రుద్రాభిషేకం చేయించి, శ్రీసూక్తం, సరస్వతీ సూక్త పారాయణలు చేయించాలి. ఈ రత్నధారణ చేసినవారు నిత్యం దక్షిణామూర్తి పారాయణ చేయుట వలన విద్యాభివృద్ధి ఉంటుంది.
నీలం: శనికి 19,000 సంఖ్య జపం చేయించి, రుద్రాభిషేకం మహా మృత్యుంజయ జపం చేయించి, నువ్వులు దానం చేసి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసిన యెడల కార్యాలస్య దోషం పోతుంది.
పచ్చ: బుధునికి 17,000 జపం, రుద్రాభిషేకం, పెసలు దానం చేయుట, విష్ణుపూజ చేసి ధరించాలి. నిత్యం విష్ణు సహస్ర నామ పారాయణం చేయవలెను.
వైఢూర్యం: కేతువుకు 7,000 జపం రుద్రాభిషేకం, గణపతి పూజ, ఉలవలు దానం చేయవలెను. నిత్యం గణపతి అష్టోత్తరం పారాయణ చేయవలెను.
వజ్రం: శుక్రునకు 20,000 జపం చేయించి, రుద్రాభిషేకం, లక్ష్మీపూజ చేయించి బొబ్బర్లు దానం చేయవలెను. నిత్యం లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలెను.

===============
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336