గ్రహానుగ్రహం

రత్నం ధరించేందుకు నియమాలు -- గ్రహానుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలం: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, చిత్త, ధనిష్ఠ, మృగశిర నక్షత్ర దినములలో కొనుగోలు, ధారణ పనికిరాదు. అయితే ఈ నక్షత్రాల వారు కూడా ధరించకూడదు.
గోమేధికం: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, శ్రవణం, హస్త, రోహిణి నక్షత్ర దినములలో కొనుగోలు చేయుట, ధారణ చేయుట పనికిరాదు. ఈ నక్షత్రాల వారు కూడా ధరించకూడదు.
వైఢూర్యం: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, శ్రవణం, హస్త, రోహిణి నక్షత్ర దినములలో కొనుగోలు చేయుట, ధారణ చేయుట మంచిది కాదు. ఈ నక్షత్రముల వారు కూడా ధరించకూడదు.
కృత్తిక, ఉత్త, ఉత్తరాషాఢ నక్షత్రముల వారికి జన్మ నక్షత్రాధిపతి రవి కనుక రవికి సంబంధించిన కెంపు ధరించాలి. హస్త, రోహిణి, శ్రవణం నక్షత్రాధిపతి చంద్రుడు. అందువలన ముత్యం ధరించాలి. మృగశిర, చిత్త ధనిష్ఠా నక్షత్రాధిపతి కుజుడు. వారు బర్త్ స్టోన్‌గా పగడం ధరించాలి. స్వాతి, శతభిషం, ఆర్ద్ర నక్షత్రాల వారికి అధిపతి రాహువు కావున బర్త్ స్టోన్‌గా గోమేధికం ధరించాలి. విశాఖ, పూర్వాభాద్ర, పునర్వసు నక్షత్రాలకు అధిపతి గురువు కావున ఈ నక్షత్రాల వారు పుష్యరాగం బర్త్ స్టోన్‌గా ధరించాలి. అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి నక్షత్రాలకు అధిపతి శని. వీరు బర్త్ స్టోన్‌గా నీలం ధరించాలి. జ్యేష్ఠ, రేవతి, ఆశ్రేషా నక్షత్రాల వారికి అధిపతి బుధుడు. అందువలన వీరు బర్త్ స్టోన్‌గా పచ్చ ధరించాలి. అశ్వని, మఘ, మూల వారు వారికి అధిపతి అయిన కేతువుకు సంబంధించిన వైఢూర్యం ధరించాలి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, నక్షత్రాల వారు వారికి అధిపతి అయిన శుక్రునికి సంబంధించిన వజ్రాన్ని ధరించాలి.
గమనిక: జన్మ నక్షత్రాన్నిబట్టి పై జాతిరాళ్లు చెప్పబడిన పుట్టిన తేదీ, సమయం ప్రకారం ఈ రత్నధారణలో మార్పులు చాలావరకు సంతరించుకుంటాయి.
జన్మలగ్నం-రత్నములు
జన్మలగ్నమునకు 6,8,12 స్థానములతో సంబంధం ఉన్న గ్రహముల యొక్క రాళ్లను ధరించకూడదు. రెండు రాళ్లను కలిపి ధరించే విషయంలో పుష్యరాగం - గోమేధికం, పుష్యరాగం - వైఢూర్యం, పుష్యరాగం - వజ్రం, కెంపు - ముత్యం కలిపి ధరించకూడదు. అలాగే కెంపు, గోమేధికం కలిపి - ముత్యం, గోమేధికం కలిపి - కెంపు, వైఢూర్యం కలిపి - ముత్యం, వైఢూర్యం కలిపి - గోమేధికం, వైఢూర్యం కలిపి, కెంపు, వజ్రం కలిపి - కెంపు నీలం కలిపి - పగడం పచ్చ కలిపి ధరించకూడదు.
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ వారు నీలం, గోమేధికం, వైఢూర్యం, వజ్రం ధరించకూడదు.
హస్త, శ్రవణం, రోహిణి నక్షత్రాల వారు గోమేధికం, వైఢూర్యం ధరించకూడదు.
మృగశిర, ధనిష్ఠ, చిత్త వారు పచ్చ ధరించకూడదు.
స్వాతి, ఆర్ద్ర, శతభిషం వారు కెంపు, ముత్యం, పుష్యరాగం ధరించకూడదు.
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర వారు వజ్రం, గోమేధికం, వైడూర్యం ధరించకూడదు.
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వారు కెంపు ధరించకూడదు.
ఆశ్రేష, రేవతి, జ్యేష్ఠ వారు పగడం, పుష్యరాగం, ముత్యం ధరించకూడదు.
మఘ, మూలా, అశ్వనీ వారు కెంపు, ముత్యం, పుష్యరాగం ధరించకూడదు.
భరణి, పూర్వాషాఢ, పుబ్బవారు కెంపు, పుష్యరాగం ధరించకూడదు.
నియమం: మల, మూత్ర విసర్జన, క్షౌరం, మైథున సమయాలలో ఈ ఉంగరాలు ధరించరాదు.
నవరత్నములు-నవగ్రహాలు
కెంపు రవి ఆత్మస్థైర్యం పెరుగుటకు
ముత్యం చంద్ర మానసిక అశాంతి తొలగుటకు
పగడం కుజ రోగ, రుణ, వ్యవహార పరిష్కారం
గోమేధికం రాహు చెడు అలవాట్లు పోవుటకు
పుష్యరాగం గురు విద్యా, ధనప్రాప్తికి
వజ్రం శుక్ర సంసార బాధలు తొలగుటకు
నీలం శని జీవనోపాధి విషయాలకు
పచ్చ బుధ వ్యాపార సౌఖ్యం కోసం
వైఢూర్యం కేతు చిత్తచాంచల్యం తొలగుటకు

=======================
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336