సాహితి

గ్రాంథిక భాషపై ద్వేషం పెంచడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి వాడుక భాషా వ్యాప్తికి కారణం గుఱజాడ వారు గిడుగువారు అనే తిరుగులేని అభిప్రాయం ఏర్పడిపోయింది. వాడుక లేక వ్యవహారిక భాష అంటే ఏమిటి? ప్రజలు నిత్య కృత్యాలలో జరుపుకునే సంభాషణలు. ఇది అన్ని ప్రదేశాలలోను ఒకే మాదిరిగా ఉండవు. కన్యాశుల్కం నాటకం వాడుక భాషలో జరిగిందని అందరు చెబుతారు. కాని ఈ నాటకం తెలంగాణాలోను రాయలసీమలోను చాలవరకు అవగాహన కాదు. ఈ నాటకంలో సంస్కృతం ఉంది. ఇంగ్లీషు ఉంది. హిందుస్థానీ ఉంది. ఇవి సామాన్యులకు ఎలా అవగాహన అవుతాయి? వీటి సంగతి అలా ఉంచుదాం. మిగిలిన నాటకం పూర్తిగా అవగాహన కావాలి కదా. అవగాహన కాని విషయాలు చాలా ఉన్నాయి. అవి అన్నీ తెలుగే. వీటి వివరణ ఎంతమంది ఈయగలరు?
‘‘ఖగపతి’’ అనే కంద పద్యంలో భగవతి అంటే సామాన్యుడుకి ఎలా అర్ధమవుతుంది? అమృతగాధ ఎలా తెలుస్తుంది? ‘‘పడు పడు అన్న నా సవితేగాని పడ్డనా సవితి లేదంది టెవర్తోను.’’
సవితి అంటే తెలుస్తుంది. పడడం ఏమిటి ఈ విషయం ఎవరయినా చెప్పగలరా?
కొత్తగా తన యింటికి వచ్చిన గిరీశాన్ని ఉద్దేశించి అగ్నిహోత్రావధాన్లు ఇలా ప్రశ్నించాడు.
‘‘ఏవండీ హనుమాన్లుగారూ మీ పేరేమిటంటి? ఇక్కడ ఈ హనుమాన్లు అంటే ఏమిటి? అది కూడా పేరు వంటిదేకదా. తిరిగి మీ పేరేమిటి? అనే ప్రశ్న ఎందుకు? ‘చిత్రం చిత్రం మహాచిత్రం’’ అని కథుంది. అలా ఉన్నాయి మీ చర్యలు అంటుంది మధురవాణి రామప్పంతులుతో. ఆ కథ ఏమిటో చెప్పమంటాడు రామప్పంతులు. పగటిపూట కథలు చెప్పకూడదు అని మధురవాణి ఆ కథ చెప్పలేదు. ఈ కథ ఏమిటో తెలియదు.
గిరీశం చెప్పిన ఈ పద్యం ఏ గ్రంథంలోనిదో తెలియదు. పద్యం బాగుంది. అర్థం తెలియడం లేదు దానిని పరిశీలించండి.
నదమా పొక్కిలి జాంబూ
నదమా మైచాయ కోకనదమాపదమా
పదమా జడనడుము వియత్
పదమా నూగారు గూఢ పదమా చెలికిన్
రాపప్పంతులు లేని సమయంలో లుబ్ధావధాన్లు వివాహం జరిగిపోతుంది. అందుకు పంతులు ఆగ్రహిస్తాడు. ఆ సమయంలో పూజారి వై.స.బు.పె అని ఎందుకన్నాడు బాబూ అని సముదాయిస్తాడు. ఈ పొడి అక్షరాలకి అర్థం ఏమిటో తెలియడం లేదు.
కేసుల విషయంలో గిరీశం ప్రగల్భాలు పలుకుతుండగా హెడ్డు లుబ్భావధాన్లుతో ‘‘యేవిటండీ ఈయన శల్యసారధ్యం? ఎవరితడు?’’ అని ప్రశ్నిస్తాడు. హెడ్ వ్యవహార జ్ఞానం కలవాడు కనుక శల్య సారధ్యం ప్రస్తావన చేశాడు. సామాన్యులకి శల్య సారధ్యం అంటే ఏం తెలుస్తుంది?
మారువేషంలో ఉన్న మధురవాణి సౌజన్యరావు పంతులుగారితో ‘‘మృచ్చకటిక చదివిందేమోనండి’’ అంటుంది. ఈ నాటకాన్ని గురించి సామాన్యులకేం తెలుస్తుంది? ఇందులో ఒక వేశ్య వృత్త్ధిర్మం ప్రక్కనపెట్టి ఒక బ్రాహ్మణ యువకుని ప్రేమిస్తుంది. ఆ నాటకం చదివిన వారికి మాత్రమే ఇది అర్థం అవుతుంది.
చివరగా మధురవాణి కేసు విషయం నిజం తెబుతూ సౌజన్యారావు పంతులుగారితో ఇలా అంది. ‘‘తెల్లబియ్యం పాటి మానికా. లుబ్ధావుధాన్లుగారు వివాహమైన పిల్ల ఆడపిల్లకాదు. ఇక్కడ మధురవాణి మాటలకు అర్థం ఏమిటో తెలియదు.
వాడుక భాషను గురించి ఎంత ప్రచారం జరిగినా అది చాలకాలం వరకు పాఠ్యపుస్తకాలలో ప్రవేశించలేకపోయింది. గుఱజాడవారు మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యులు. ఆనాటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదు. 1914వ సంవత్సరంలో విశ్వవిద్యాలయం వాడుక భాషను పాఠ్యపుస్తకాలలో చేర్చరాదని తీర్మానించింది. దానికి గుఱజాడవారు అసమ్మతి తెలిపారు. వాడుక భాష పాఠ్యపుస్తకాలలో ప్రవేశించడానికి చాలాకాలం పట్టింది. 1960వ దశకంలో ఇది ప్రవేశించినట్లు నాకు గుర్తు. ఇలా ప్రవేశించడానికి కొందరు ఆధునికులు విద్యాశాఖలో గ్రాంథిక భాషపై ద్వేషముగల అధికార్లు కారణం. అంతేకాని గిడుగువారు గుఱజాడ వారు కాదు. వారి వలననే నేడు పాఠ్యపుస్తకాలన్నిటిలోను వ్యవహారిక భాష ప్రవేశించినదని చెప్పడం పొరపాటు. వారి ప్రభావం వలన అయితే ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలలో వ్యవహారిక భాష ప్రారంభం కావాలి. రచనల వలన సంఘ సంస్కరణ జరుగుతుంది అనకోవడం సరికాదు. కవి పాఠకులకి దిశా నిర్దేశం చేస్తాడు. దానిని అనుసరించడం పాఠకుల ఇష్టం. ఈ సందర్భంగా కన్యాశుల్కం నాలుకపై విశేష పరిశోధన చేసిన సెట్టి ఈశ్వరరావుగారి పలుకులు పరిశీలించండి. ‘‘గుఱజాడ జీవితకాలం తరువాత చాలా దశాబ్దాలు గడిచిపోయాయి. ఆయన వేలెత్తి చూపిన చెడుగులు అప్పటి కంటె ఇప్పుడు ఏదో వొక రూపంలో అంతకుమించిన ఉగ్ర రూపంతో వున్నాయి. సామాజికంగానే గాక సర్వరంగాలలోను వ్యాపించి వున్నాయి.’’ కన్యాశుల్కం ఒక అద్భుత సృష్టి అది రసజ్ఞులు చదివి ఆనందించవలసిందే. సౌజన్యారావు పంతులుగారంటే అప్పారావుగారే.

- వేదుల సత్యనారాయణ 9618396071