ఖమ్మం

అవి తెలంగాణ గ్రేహౌండ్స్ హత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇరుపక్షాల కాల్పులుగా చిత్రీకరణ
* బెట్టెంతోగు ఎన్‌కౌంటర్ ప్రదేశంలో మానవహక్కుల వేదిక బృందం పరిశీలన
భద్రాచలం, మార్చి 7: ఈ నెల 1వ తేదీన బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాకు ఉడతమల్లి పంచాయతీ పరిధిలోని బెట్టెంతోగులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరిపి మావోయిస్టులను హత్య చేశారని మానవహక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి విఎస్ కృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాదర్‌బాబు, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటనర్సయ్య, కార్యవర్గ సభ్యులు కె.సుధ, రమేశ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం సోమవారం బెట్టెంతోగు ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించి నిజనిర్ధారణ చేసింది. స్థానికుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం మార్చి 1వ తేదీన తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు ఉదయం 7 గంటల సమయంలో బెట్టెంతోగు గ్రామంలోకి ప్రవేశించాయి. ఊరి చెరువు పక్కన మావోయిస్టుల క్యాంపు నడుస్తోంది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు మహిళా నక్సల్స్‌ను, సెంట్రీగా ఉన్న నక్సల్‌ను కాల్చి చంపిన గ్రేహౌండ్స్ బలగాలు పడమర దిక్కు నుంచి ఏకపక్షంగా కాల్పులు జరుపుకుంటూ ముందుకు వెళ్లాయి. వీరిలో ఒక మహిళా నక్సల్‌కు కాలికి తూటా తగిలి ఉండగా ఆమెను సైతం కాల్చి చంపారు. 50 నుంచి 60 మంది నక్సల్స్ ఉన్నారని, 9 మంది చనిపోగా మిగిలిన వారంతా పారిపోయారని వారు వివరించారు. అసలు వారు ఎదురుకాల్పులు కూడా జరపలేదన్నారు. అనంతరం ఇదే గ్రామంలో 5గురు ఆదివాసీ గ్రేహౌండ్స్ పోలీసులు మహిళలను కర్రలతో చితకబాదారన్నారు. పక్కనే ఉన్న ఎర్రపల్లి గ్రామం నుంచి మడకం బొజ్జా అనే యువకుడిని ఎత్తుకెళ్లారని, అతని ఆచూకీ నేటికీ తెలియడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. కేవలం 15 నిముషాల్లోనే గ్రేహౌండ్స్ కాల్పులు జరిపి 9 మందిని పొట్టన బెట్టుకున్నారని అన్నారు. ఇరుపక్షాల కాల్పులు కాదని, ఏకపక్ష కాల్పులని, ఇవి గ్రేహౌండ్స్ హత్యలని మానవహక్కుల బృందం ఆరోపించింది. కాల్చి చంపాక తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ, ఛత్తీస్‌గఢ్ సీనియర్ పోలీసు అధికారి కల్లూరిలు వాస్తవాలను వక్రీకరించి నక్సల్స్ ప్రతిఘటించడంతో ఆత్మరక్షణార్థం కాల్పులు జరపాల్సి వచ్చిందని ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. కాల్పుల్లో పాల్గొన్న గ్రేహౌండ్స్ పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని, స్వతంత్ర నేరపరిశోధన విభాగంతో ఈ కాల్పుల ఘటనపై విచారణ జరిపించాలని బృందం డిమాండ్ చేసింది.