తెలంగాణ

ఇక గ్రేటర్ సిరిసిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్, మార్చి 11: సిరిసిల్ల పట్టణాన్ని ఇక గ్రేటర్ సిరిసిల్లగా అభివృద్ధి చేయనున్నట్టు ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. అమృత్ పథకంలో సిరిసిల్ల్లను చేర్పించనున్నట్టు చెప్పారు. నియోజక వర్గానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకులు నగరంలో శుక్రవారం కెటిఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడారు. మంత్రిగా సిరిసిల్లా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పట్టణ ప్రజలే నమ్మలేనట్టుగా సిరిసిల్లా పట్టణాన్ని తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. సిరిసిల్లా పట్టణాన్ని విస్తరించి గ్రేటర్ సిరిసిల్లాగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్ పథకంలో సిరిసిల్లాను చేర్చనున్నట్టు చెప్పారు. దీని వల్ల 60 కోట్ల రూపాయలు పొందేందుకు అవకాశం ఉందని అన్నారు. ఏడాదిన్నరలో సిరిసిల్లాలో సమూల మార్పులు తీసుకు రానున్నట్టు, దీని కోసం ఎన్ని నిధులైనా వెచ్చించనున్నట్టు చెప్పారు. పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం 30 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. మరో 30 కోట్లు విడుదల చేసి పనులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పట్టణంలో నిరంతర విద్యుత్ కోసం సెస్ సహకారంతో ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. సిరిసిల్లా నుంచి సిద్దిపేట, సిరిసిల్లా నుంచి కామారెడ్డి వరకు జాతీయ రహదారి విస్తరణ చేయిస్తామని చెప్పారు. తనకున్న పరిచయాలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ద్వారా కంపెనీల ఏర్పాటు నిధుల సమీకరణ చేయనున్నట్టు చెప్పారు.