తెలంగాణ

గ్రేటర్ వరంగల్ గులాబీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంపి దయాకర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ వెల్లడి
వరంగల్, డిసెంబర్ 31: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎగిరేది గులాబీ జెండాయేనని వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం హన్మకొండలోని టిఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, నగర అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు ఎంతగానో లభిస్తున్నాయన్నారు. ఆసరా పథకం ద్వారా అనేక మందికి పెన్షన్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. బీడీ, కల్లు గీత కార్మికులకూ పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లల పెళ్లిలకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. త్వరలోనే వరంగల్ నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతమవుతాయని తెలిపారు. రూ.150 కోట్లతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తెలిపారు. ఇప్పటికే రూ.30 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. నియోజకవర్గంలో రూ.150 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. హృదయ్, హడ్కో పథకాల ద్వారా తమ నియోజకర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే రూ.1.80 కోట్లతో నగరంలో ఆధునాతనమైన వెజ్, ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. రూ.1.18 కోట్లతో భద్రకాళి దేవస్థానంలో అన్నదాన సత్రంతో పాటు వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పేద, మధ్య తరగతి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా వెడ్డింగ్ జోన్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నామన్నారు. చిరువ్యాపారులను జలగల్లా పీడించే గిరిగిరి వ్యాపారానికి చెక్‌పెట్టి బ్యాంకుల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తున్నామన్నారు. వడ్డెపల్లి పింగిళి జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.2.20 కోట్లతో వౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. తన నియోజకవర్గంలో 800 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రానికి రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైద్రాబాద్ తర్వాత అతివేగంగా విస్తరిస్తున్న వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నట్లు వెల్లడించారు. ఎంపి పసునూరి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి పరుస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పక్షపాతి అని ఆయన అన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు గుడిమళ్ల రవికుమార్, నార్లగిరి రమేష్, వాసుదేవరెడ్డి, డిన్న తదితరులు పాల్గొన్నారు.