జాతీయ వార్తలు

జిఎస్‌టి బిల్లుకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 12: వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు కు ఆమోదం లభిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బిల్లు ఆమోదానికి సహకరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడిక్కడ మంత్రి మాట్లాడుతూ గత రెండు సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ఈ సారైనా పరిణతి చెందిన పార్టీగా వ్యవహరిస్తుదని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 2008లో జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ తమతో మాట్లాడలేదని మంత్రి చెప్పారు. దీనిపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.‘బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న గట్టి నమ్మకం నాకుంది. ఈ విషయంలో ఆశావాదంతో ఉన్నాను. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించుకుండా సహకరించాలి’అని కాంగ్రెస్‌కు సూచించారు. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, తాను కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పార్టీ సీనియర్లతో మాట్లాడినట్టు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బిల్లు ఆమోదానికి సంబంధించి కాంగ్రెస్ ప్రతిపాదించినవాటన్నింటినీ పొందుపరచలేమని మంత్రి అన్నారు. తాము లేవనెత్తినవి ఎందుకు ఆమోదయోగ్యం కాదో ప్రభుత్వం వివరణను ప్రతిపక్షం వినాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఐదు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టి బిల్లుకు సహకరించాలని కోరారు. బాధ్యతగల ప్రతిపక్షంగా వ్యవహరించాలని వెంకయ్య చెప్పారు.