బిజినెస్

గుజరాత్ ప్లాంట్‌పై నెగ్గిన మారుతి సుజుకి మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైనారిటీ భాగస్వాముల ఆమోదం
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: గుజరాత్ ప్లాంట్‌పై మైనారిటీ భాగస్వాముల అనుమతిని మారుతి సుజుకి ఇండియా పొందింది. గుజరాత్‌లో ఏర్పాటయ్యే ప్లాంట్‌ను జపాన్‌కు చెందిన సుజుకి సంస్థ సొంతం చేసుకోవడానికి సంబంధించి మారుతి సుజుకి తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో 89.75 శాతం అనుకూలంగా, 10.25 శాతం వ్యతిరేకంగా ఓట్లు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం ఇక్కడ మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ విలేఖరులకు తెలిపారు. గుజరాత్ ప్లాంట్‌ను సుజుకికి అప్పగించాలని మారుతి నిర్ణయం తీసుకున్నది తెలిసిందే. ఈ ప్లాంట్‌పై సుజుకి 18,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఇదిలావుంటే ఏటా 30 లక్షల కార్ల అమ్మకాల కోసం మారుతి సుజుకి, దాని డీలర్లు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
నూతన బేస్‌రేటు గణన పద్ధతిని ప్రకటించిన ఆర్‌బిఐ
ముంబయి, డిసెంబర్ 17: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గురువారం నూతన బేస్‌రేటు గణన పద్ధతిని ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) ఆరంభం (ఏప్రిల్ 1) నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారంగా బేస్ రేటు గణన ఉంటుందని ఆర్‌బిఐ పేర్కొంది. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఆర్‌బిఐ ప్రకటనను స్వాగతించింది.