జాతీయ వార్తలు

గుజరాత్‌ అసెంబ్లీలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పీకర్‌ సాక్షిగా కాంగ్రెస్‌, భాజపా ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ఉపముఖ్యమంత్రి నితిన్‌పటేల్‌ ఓ అంశాన్ని లేవనెత్తారు.
ఈ క్రమంలో భాజపా ఎమ్మెల్యే జగదీశ్‌ పంచల్‌.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమ్రీష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్పీకర్‌ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే భాజపా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరోసారి వాగ్వాదానికి దిగారు. ఇంతలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమ్రీష్‌ వెంటనే సభలోకి వచ్చి ఓ భాజపా ఎమ్మెల్యేను కొట్టారు. భాజపా ఎమ్మెల్యేలు అమ్రీష్‌ను చుట్టుముట్టి ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. సభను మరోసారి వాయిదా వేశారు.