రంగారెడ్డి

శంబీపూర్‌లో గుబాళించిన గులాబీ దళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 31: రంగారెడ్డి జిల్లా నుండి నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యుడు శంభీపూర్ రాజును ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో కలిసి శుభాకాంక్షలను తెలిపారు. నూతన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు స్వగ్రామమైన శంబీపూర్ గ్రామంలో ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ శ్రేణులు, గులాబీ దళంతో శంబీపూర్ గుబాళించింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుకు శుభాకాంక్షలను తెలిపేందుకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో శంబీపూర్ గ్రామం గులాబీ మయంగా మారింది. కుత్బుల్లాపూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆగం రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో శంబీపూర్ గ్రామానికి తరలివెళ్లి రాజును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలను తెలిపారు. బాచుపల్లి సర్పంచ్ ఆగం పాండు అనుచరులతో కలిసి రాజుకు మిఠాయిలను తినిపించి శుభాకాంక్షలను తెలియజేశారు. మల్లంపేట్ గ్రామ సర్పంచ్ అర్కల అనంతస్వామి, సీనియర్ నాయకుడు కొలను శ్రీనివాస్‌రెడ్డి, నిజాంపేట్ టిఆర్‌ఎస్ నేత దన్‌రాజ్ యాదవ్, నిజాంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ వడ్ల నాగేశ్‌చారి, టిఆర్‌ఎస్ నేత నాగరాజు యాదవ్, మాజీ కార్పొరేటర్‌లు జగన్, శేషగిరి, వివిధ డివిజన్‌ల టిఆర్‌ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నేతలు పెద్దసంఖ్యలో శంబీపూర్‌కు తరలివచ్చి రాజును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తనకు టిఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా టిక్కెట్‌ను ఇచ్చి గెలిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రివర్యులు కేటిఆర్, మహేందర్‌రెడ్డి, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలను తెలిపారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి తనవంతు బాధ్యతగా పాటుపడుతూ ఎంపిటిసి సభ్యుల సమస్యలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ పుట్టిన నాటి నుండి తాను తెలంగాణ ఉద్యమంలో అనేక విధాలుగా ఆటుపోట్లను ఎదుర్కొంటూనే పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డానని తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, మండలంలోని అన్నిగ్రామాలకు గోదావరి జలాలను తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ శ్రేణులతో శంబీపూర్ గ్రామం సందడిగా మారింది.