గుంటూరు

ఇసుక రీచ్‌ల వద్ద నిబంధనలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మార్చి 27: అనుమతులు పొందిన ఉచిత ఇసుకరీచ్‌ల వద్ద ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని డిఎస్‌పి మధుసూధనరావు సూచించారు. ఆదివారం ఆయన కోనూరు ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ఇసుక తోలకాలు చేపట్టాలన్నారు. పెత్తందారులు ఇసుకరీచ్‌ల వద్ద ఆటంకాలు కల్పించరాదని స్పష్టంచేశారు. రీచ్‌లలో ఏ వాహనమైనా క్యూ పద్ధతిని పాటించాల్సిందేనన్నారు. లోకల్, నాన్‌లోకల్ తేడాలేకుండా అందరూ సమయం పాటించి సహకరించాలన్నారు. ఇసుకరీచ్‌ల వద్ద ఏమాత్రం అవినీతి, అరోపణలు చోటిచ్చినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు కూడా నిబంధనలకు లోబడి నిర్ణయించిన ధరలను అమలుపర్చాలన్నారు. డిఎస్‌పి వెంట అచ్చంపేట, క్రోసూరు ఎస్‌ఐలు జి రాజేశ్వరరావు, బ్రహ్మం, కోనూరు, కస్తల సర్పంచ్‌లు లక్ష్మీనారాయణ, వై మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.