క్రీడాభూమి

గుప్టిల్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్ 8 వికెట్లకు 409 * శ్రీలంకతో మొదటి టెస్టు

డ్యునెడిన్ (న్యూజిలాండ్), డిసెంబర్ 10: శ్రీలంకతో గురువారం ఆరంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజున న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 409 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీతో కదంతొక్కగా, కేన్ విలియమ్‌సన్, కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ అర్ధ శతకాలు నమోదు చేశారు. లంక బౌలర్లలో సురంగ లక్మల్, నవాన్ ప్రదీప్, దుష్మంత చమీర తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా, కివీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గుప్టిల్, టామ్ లాథమ్ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. లాథమ్ 22 పరుగులు చేసి లక్మల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్‌కావడంతో కివీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం విలియమ్‌సన్‌తో కలిసి గుప్టిల్ రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించాడు. 88 పరుగులు చేసిన విలియమ్‌సన్‌ను కరుణరత్నే క్యాచ్ పట్టగా ప్రదీప్ అవుట్ చేశాడు. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ కేవలం ఎనిమిది పరుగులకే అవుట్‌కాగా, మెక్‌కలమ్ 57 బంతుల్లోనే 75 పరుగులు చేసి సిరివర్ధన బౌలింగ్‌లో వితనాగేకు చిక్కాడు. సాట్నర్ (12), వాల్టింగ్ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. గుప్టిల్ 234 బంతులు ఎదుర్కొని, 21 ఫోర్లతో 156 పరుగులు సాధించి, లంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ దినేష్ చండీమల్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. ఏడో బ్యాట్స్‌మన్‌గా గుప్టిల్ వెనుదిరగ్గా, టిమ్ సౌథీ కేవలం రెండు పరుగులు చేసి లక్మల్ బౌలింగ్‌లో సిరివర్ధనేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి లంక 90 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగు చేయగా, బ్రాస్‌వెల్ (32), వాగ్నర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. (చిత్రం) సెంచరీ సాధించిన కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (156)

సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 8 వికెట్లకు 409 (మార్టిన్ గుప్టిల్ 156, విలియమ్‌సన్ 88, మెక్‌కలమ్ 75).