రాష్ట్రీయం

మురళీకృష్ణుడిగా లక్ష్మీనరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదాద్రిలో వైభవంగా హంస వాహన సేవ

నల్లగొండ, మార్చి 13: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు సోమవారం లక్ష్మీనరసింహుడు మురళీకృష్ణ అవతారంలో, హంసవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. పంచనారసింహుడి అలంకార సేవలో భాగంగా ముగ్ధమనోహర సమ్మోహన రూపం మురళీకృష్ణ అవతార అలంకరణతో తిరువీధుల్లో ఊరేగించారు. రాత్రి హంసవాహన ఆధిరోహుడైన లక్ష్మీనరసింహుడు వీణాపాణిగా తీరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి తరింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నర్సింహాచార్యుల నేతృత్వంలో ఆత్రేయాచార్యులు స్వామివారికి మురళీకృష్ణావతార అలంకరణలో ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవ ఘట్టంలో భాగంగా యాగశాలలో పారాయణం, విష్ణుసహస్రనామార్చనలు కొనసాగాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఇతర దేవస్థాన అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు పొన్న వాహనంపై వటపత్ర సాయిగా దర్శనం
యాదాద్రి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజు సోమవారం శ్రీవారి అలంకార సేవలో భాగంగా ఉదయం వటపత్రసాయి అలంకరణతో దర్శనమిస్తారు. రాత్రి పొన్న వాహనంపై శృంగార నారసింహుడిగా తీరువీధుల్లో ఊరేగుతారు. కాగా, యాదాద్రి బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తులందరికీ దేవస్థానం స్వామివారి ప్రసాదంగా ఉచిత భోజన వసతిని కొనసాగిస్తున్నారు. ఈ నెల 19వరకు భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం కొనసాగనుంది. అటు సంగీత్ భవన్‌లో కొనసాగుతున్న ధార్మిక మహాసభలలో భాగంగా పౌరాణిక గాథలతో కూడిన సాంస్కృతిక ఉత్సవాలు బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను ఆకట్టుకుంటున్నాయి.