జాతీయ వార్తలు

ఎంపీ జీవీఎల్‌పైకి చెప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా శక్త్భిర్గవ్ అనే వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన జీవీఎల్ వెంటనే కాసేపటికి తేరుకున్నారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. కాన్పూర్ లోకసభ స్థానం నుంచి పోటీచేస్తున్న ప్రజ్ఞాసాధ్విపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన విమర్శలను ఖండించేందుకు జీవీఎల్ ప్రెస్‌మీట్ ఏర్పాటుచేశారు. చెప్పువిసిరిన వ్యక్తిపైకి బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కారణాలు తెలియరాలేదు. కాగా ఈ ఘటనపై జీవీఎల్ మాట్లాడుతూ ఇది కాంగ్రెస్‌వారి పనేనని అన్నారు.