అదిలాబాద్

హెల్మెట్‌పై అవగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జనవరి 21: ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నరేష్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, గ్రామస్తులకు రోడ్ల భద్రతపై అవగాహన సదస్సును సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ సి ఐ నరేష్‌కుమార్ మాట్లాడుతూ జనాభా పెరగడం వల్ల అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల వలన ఇప్పటి వరకు ఒక లక్ష 50 వేల మంది మృతిచెందారని ఆయన తెలిపారు. రోడ్డు దాటుతున్నప్పుడు, మూల మలుపుల వద్ద డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించడం వలన, డ్రైవింగ్ అనుభవం లేకపోవడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నివారణ చర్యల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ వాడకున్నా ద్విచక్ర వాహనం సరిగా లేకపోయిన వారికి, డ్రైవర్లకు జరిమానా వేయడం జరుగుతుందన్నారు. హెల్మెట్‌ను ద్విచక్ర వాహనదారులు తప్పకుండా వాడాలని, తల్లితండ్రులకు చెప్పాలని విద్యార్థులకు ఆయన కోరారు. చిన్న ఆటోలో ముగ్గురు ప్రయాణికులు, పెద్ద ఆటోల్లో ఏడుగురు ప్రయాణీకులే కూర్చోవాలని ఆయన కోరారు. ఆటోలో ఎక్కేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, చిన్న పిల్లవాడా, అనుభవం ఉందా చూసి ప్రయాణీకులు ఎక్కాలని ఆయన కోరారు. ఇంట్లో ఒక మోటారు సైకిల్ ఉంటే నడపవచ్చిన వారందరు లైసెన్స్ పొందాలని, ప్రయాణీకులు ఆర్టిసి బస్సుల్లోనే ప్రయాణించడం సురక్షితమని ఆయన హితవు పలికారు. మద్యం సేవించి బండి నడపవద్దని ఆయన కోరారు. అనంతరం లింగాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున పలు వీధులగుండా ఖానాపూర్ సి ఐ నరేష్‌కుమార్, కడెం ఎస్సై రాము, పోలీసులు, ద్విచక్రవాహనదారులు, గ్రామస్తులు హెల్మెట్‌లను ధరించి వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి యూత్ వారు సి ఐ నరేష్‌చేతుల మీదుగా 9వ తరగతి విద్యార్థులు 60 మందికి ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కడెం ఎస్సై రాము, లింగాపూర్ ఉప సర్పంచ్ మాదస్తు నాగేష్, జడ్పి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు నర్సింహస్వామి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గంగారావు, నాయకులు నందయ్య, నర్సయ్య, కె.లక్ష్మినర్సయ్య, పోలీసులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.