హైదరాబాద్

హైదరాబాద్ అభివృద్ధి ఘనత మా తాత, తండ్రి, టిడిపిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 25: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది మా తాత, మా తండ్రి, తెలుగుదేశం పార్టీయేనని, హైదరాబాద్ ఎవరి అబ్బ సొమ్ము కాదని, కెటిఆర్ తాత, ఆయన తండ్రి అభివృద్ధి చేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్‌లోని అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో రోడ్‌షోలను నిర్వహించారు. నగరం అభివృద్ధి చెందాలంటే టిడిపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం హామీలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఘాటుగా విమర్శించారు. బెంగళూరు, హైదరాబాద్‌లో ఒకేసారి మెట్రో పనులు ప్రారంభమయ్యాయని, బెంగళూరులో ప్రాజెక్టు పూరె్తై ట్రైన్లు సైతం తిరుగుతున్నాయని, హైదరాబాద్‌లో మాత్రం ఇంకా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. కెటిఆర్ షికారు కోసం మెట్రో ట్రైన్‌ను వేశారే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి గల్లీకి నిధులు వస్తాయని చెప్పారు. తెలుగుదేశం హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందిందని, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు, రేడియల్ రోడ్స్, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించి హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేశారని పేర్కొన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో విశ్వనగరాన్ని చెత్త నగరంగా మార్చారని విమర్శించారు. గ్రేటర్ నిధులైన రూ.14 వేల కోట్లను తీసుకెళ్లి మిషన్ భగీరథకు ఉపయోగించారని మండిపడ్డారు. ప్రజల బాధలను వదిలి వేసి ఫాంహౌస్‌లలో కెసిఆర్‌లో గడుపుతూ పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. టిడిపి హయాంలోనే ఐటి రంగాన్ని ప్రోత్సహించారని, దాంతో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా అందాయని చెప్పారు.